బాలకృష్ణ యాక్షన్‌ ఎపిసోడ్లకి బీభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారు. దాన్ని బాగా ఎంజాయ్‌ చేసేవాళ్లు ఎంతో మది ఉన్నారు. అయితే రజనీకాంత్‌ ముందు యాక్షన్‌ చేసి తొడగొట్టాడు బాలయ్య.  

బాలకృష్ణ అంటే హీరోగా లార్జర్‌ దెన్‌ లైఫ్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న హీరో. ఆయన సినిమాలంటే ఆడియెన్స్ ఊగిపోయి చూస్తారు. ఫ్యాన్స్ కి పండగే అని చెప్పొచ్చు. బాలకృష్ణ సినిమాల్లో ఫైట్లు చాలా స్పెషల్‌. ఊహించని విధంగా ఉంటాయి. వాహ్‌ అనేలా ఉంటాయి. సాధారణంగా ఎవరికీ సాధ్యం కానివి బాలయ్య చేస్తాడనేలా ఉంటాయి. అదే సమయంలోబాలయ్య అంటే ఇలానే ఉండాలనేలా ఆయన మూవీస్‌లో ఫైట్లు ఉంటాయి. 

ఒకప్పుడు ఆయన చేసిన యాక్షన్‌ సీక్వెన్స్ లు, డైలాగులు ఇప్పుడు వింటుంటే కామెడీగా బాగా ఎంజాయ్‌ చేసేలా ఉంటాయి. తొడగొట్టడం, వార్నింగ్‌ ఇవ్వడం హైలైట్‌గా ఉంటాయి. సినిమాల్లోఫైట్‌ చేసే బాలయ్య, సినిమాల్లో తొడ గొట్టే బాలయ్య రియల్‌ లైఫ్‌లో కొట్టాడు. స్టేజ్‌పై ఫైట్‌ చేసి తొడగొట్టడం ఓ విశేషమైతే, సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ముందు ఇదంతా జరగడం విశేషం. మరి ఇంతకి ఏం జరిగిందంటే.. 

గతంలో బాలయ్య ఓ తమిళ సినిమా ఈవెంట్‌లో పాల్గొన్నారు. గెస్ట్ గా ఆయన సందడి చేశారు. ఈవెంట్‌ మొత్తాన్ని తనవైపు ఆకర్షించేలా చేశాడు. ఇందులో రజనీకాంత్‌, ధనుష్‌, సూర్య, కార్తి, జయం రవి, శివకార్తికేయ, వంటి వారితోపాటు హీరోయిన్లు కూడా ఉన్నాయి. ఈ ఈవెంట్‌లో బాలయ్యని స్టేజపైకి పిలిచి పుష్పగుచ్చం ఇచ్చిన అనంతరం తెలుగులో మాట్లాడతారా? తమిళంలోనా అంటే తమిళంలోనే మాట్లాడి తన ప్రత్యేకతని చాటారు బాలయ్య. 

ఇందులో యాంకర్‌.. సర్‌ మీ లైవ్‌ యాక్షన్‌ చూడాలని ఉందని అడగడంతో, దానిదేముంది చేసేదాం అన్నారు. అన్నట్టుగానే కొందరు బాయ్స్ వచ్చారు. వాళ్లని తన సినిమాల్లోని ఫైట్ల మాదిరిగా ఒకేదెబ్బకి ఐదారుగురుని మట్టుకరిపించాడు బాలయ్య. వాళ్లని కొట్టేసి ఆయన తొడగొట్టడం విశేషం. రజనీకాంత్‌ ముందే ఇది చేయడం మరో విశేషం. దీంతో రజనీ చప్పట్లతో బాలయ్యని అభినందనించారు. బాలయ్య స్టేజ్‌పై చేసిన యాక్షన్‌కి సూర్య, ధనుష్‌, కార్తీ వంటి హీరోలు షాక్‌అవడం విశేషం. ఈ రేర్‌ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

Scroll to load tweet…

ఇక బాలకృష్ణ.. ప్రస్తుతం `ఎన్బీకే109` చిత్రంలో నటిస్తున్నారు. బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. దీంతోపాటు బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. త్వరలో ప్రారంభం కానుంది. అలాగే రాజకీయాల్లో బాలయ్య యాక్టివ్‌గా ఉన్నారు. హిందూపురం నుంచి ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే.