'బలగం' సినిమా డైరెక్టర్ వేణు మా ఊరు వాడే. ఇట్లా దిల్ రాజుగారు ఒక ఛాన్స్ ఇచ్చారు .. హెల్ప్ చేయండి అని అడిగితే నా ఇల్లు ఇచ్చాను. 


దిల్ రాజు ప్రొడక్షన్స్ లో జబర్దస్త్ కమెడియన్, నటుడు వేణు(Venu) దర్శకుడిగా మారి రూపొందించిన చిత్రం బలగం. క్రిందట నెల 3వ తేదీన ఈ సినిమా థియేటర్లకు వచ్చింది. రిలీజ్ కి ముందు పెద్దగా అంచనాలు లేని ఈ సినిమా, మౌత్ టాక్ తో ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించింది. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను అద్భుతంగా ఆవిష్కరించిన జీవనచిత్రంగా ప్రశంసలను అందుకుంది. చిన్న సినిమాగా రిలీజయి పెద్ద విజయం సాధించింది. కలెక్షన్స్ తో పాటు పేరు, అభినందనలు, అవార్డులు కూడా సంపాదిస్తుంది బలగం సినిమా.

అదే సమయంలో బలగం సినిమా వివాదాల్లో కూడా నిలుస్తుంది. సినిమా రిలీజయిన సమయంలో బలగం సినిమా కథ నాది అని ఒకరు వివాదం వచ్చింది. ఆ తర్వాత ఓటీటీలో రిలీజ్ అయ్యాక ఊళ్ళల్లో తెరలు కట్టి బలగం సినిమా వేయడంతో అమెజాన్ దిల్ రాజు మధ్య ఓ వివాదం నెలకొంది. కొన్ని రోజుల క్రితం బలగం సినిమా వల్ల మా మనోభావాలు దెబ్బతిన్నాయని కొంతమంది MPTCలు ఫిర్యాదు చేశారు. ఇలా వరుసగా ఏదో ఒక వివాదం బలగం సినిమాను వెంటాడుతుంది. తాజాగా బలగం సినిమా డైరెక్టర్ వేణుపై ఓ వ్యక్తి సంచలన కామెంట్స్ చేశాడు. 

ఈ సినిమా షూటింగు అంతా కూడా 'సిరిసిల్ల' పరిసర ప్రాంతాల్లో జరిగింది. ఈ సినిమా చిత్రీకరణ జరిపిన లొకేషన్స్ కూడా పాప్యులర్ కావడం విశేషం. అలాంటి లొకేషన్స్ లో హీరో ఇల్లు కూడా ఒకటి. షూటింగు కోసం ఈ ఇంటిని ఇచ్చిన రవీంద్రరావు తాజా ఇంటర్వ్యూలో మాట్లాడారు.

'బలగం' సినిమా డైరెక్టర్ వేణు మా ఊరు వాడే. ఇట్లా దిల్ రాజుగారు ఒక ఛాన్స్ ఇచ్చారు .. హెల్ప్ చేయండి అని అడిగితే నా ఇల్లు ఇచ్చాను. నెలా పదిహేను రోజుల పాటు ఈ ఇంట్లో షూటింగు చేశారు. అప్పటివరకూ మేము వేరే ఇంట్లో ఉన్నాము. వేణు దగ్గర మేము ఒక రూపాయి కూడా తీసుకోలేదు. ఈ సినిమా ఇంతపెద్ద హిట్ అవుతుందని మేము అనుకోలేదు. ఈ సినిమాలో మా ఇల్లు ఉండటం మాకు సంతోషాన్ని కలిగించింది" అన్నారు. 

"ఈ సినిమా షూటింగు సమయంలో దిల్ రాజు గారు ఇక్కడికి రాలేదు. ఆయన కూతురు .. తమ్ముడి కొడుకు మాత్రం వచ్చారు. సినిమా ఇంత పెద్ద హిట్ అయిన తరువాత వేణు థ్యాంక్స్ చెప్పలేదు .. ఫోన్ కూడా చేయలేదు. నా నెంబర్ ఆయన దగ్గర ఉంది గానీ .. మేము గుర్తుకురాలేదు. ఆయన నుంచి ఇవేమీ నేను ఆశించలేదు కూడా. ఈ సినిమా కోసం ఇష్టంగా ఇల్లు ఇచ్చాను అంతే. అందువలన ఎలాంటి పబ్లిసిటీని నేను కోరుకోవడం లేదు" అంటూ చెప్పుకొచ్చారు.