Asianet News TeluguAsianet News Telugu

బలగం డైరెక్టర్ వేణుకు దిల్ రాజు ఎన్ని కోట్లు ఇచ్చాడు?... ఇదిగో క్లారిటీ!


బలగం డైరెక్టర్ వేణు ఎల్దండి తన రెమ్యునరేషన్ మీద స్పందించారు. దిల్ రాజు ఎంత ఇచ్చారో ఓ ఇంటర్వ్యూలో నేరుగా చెప్పారు.  
 

balagam movie director venu opens up on remuneration he got paid by dil raju ksr
Author
First Published Mar 26, 2023, 4:48 PM IST

ఎక్కడ చూసినా ప్రేక్షకులు బలగం మూవీ గురించే చెప్పుకుంటున్నారు. గొప్పగా ఉందంటూ కొనియాడుతున్నారు. దర్శకుడు వేణు ఎల్దండి పేరు మారుమ్రోగుతుంది. ఈ పల్లెటూరి ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా బాక్సాఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేసింది. దాదాపు రూ. 22 కోట్ల గ్రాస్ రూ. 10 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన బలగం అతిపెద్ద విజయం నమోదు చేసింది. దిల్ రాజు ప్రొడ్యూసరన్న హైప్ తప్పితే బలగం మూవీలో స్టార్ క్యాస్ట్ లేరు. అయినా ఆడియన్స్ థియేటర్స్ కి పోటెత్తారు. 

బలగం మూవీ అటు విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది.ఇంత పెద్ద విజయం నమోదు చేసిన డైరెక్టర్ వేణు ఎల్దండికి దిల్ రాజు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారనే ఆత్రుత అందరిలో ఉంది. దీనిపై వేణు స్వయంగా మాట్లాడారు. అయితే అమౌంట్ చెప్పేందుకు ఆయన ఇష్టపడలేదు. ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణును... దిల్ రాజు మీకు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారని యాంకర్ అడిగారు. 

దిల్ రాజు నాకు ఎంత ఇచ్చారనేది చెప్ప కూడదు. అది ప్రోటోకాల్ కాదు అన్నారు. యాంకర్ కలగజేసుకుంటూ... సాధారణంగా మూవీ అంచనాలకు మించి ఆడితే నిర్మాతలు, హీరోలు తమ దర్శకులకు గిఫ్ట్స్ ఇస్తారు. దిల్ రాజు కూడా మీకు ఆడి లేదా రేంజ్ రోవర్ ఇవ్వాలనుకుంటున్నారని బయట టాక్ అన్నారు. దానికి వేణు, ఇస్తే మీకు చూపిస్తాను. ఎంత ఇచ్చారనేది పక్కన పెడితే ఆయన నా మీద చూపించే ప్రేమ ముఖ్యం. వందల కోట్ల రూపాయలతో సినిమాలు చేసే దిల్ రాజు బలగం లాంటి ఒక చిన్న సినిమా నిర్మించి కష్టపడి ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు.  

ఆయన ఒక గొప్ప సినిమా లవర్. ఈ రెండేళ్ల జర్నీలో నేను చూసిందదే, అంటూ చెప్పుకొచ్చారు. బలగం సక్సెస్ నేపథ్యంలో దిల్ రాజు వేణుకు మరో ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. కాగా బలగం మూవీ కథ నాదే అంటూ జర్నలిస్ట్ సతీష్ గడ్డం మీడియా ముందు ఆరోపణలు చేశారు. గతంలో నేను రాసిన పుచ్ఛిక అనే కథకు మార్పులు చేసి బలగం మూవీ తీశారంటూ ఆయన ఆరోపించారు. గడ్డం సతీష్ ఆరోపణలు ఖండించిన వేణు... ఆయన కథ నేను చదివింది లేదు. ఆరేళ్ళు నేను రీసెర్చ్ చేసి రాసుకున్న కథ అని చెప్పుకొచ్చారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios