బుల్లితెరపై మరోసారి హవా చూపించిన బలగం..ఎంత టీఆర్పీ వచ్చిందంటే..?

రిలీజ్ అయ్యి చాలా కాలం అయ్యింది.. రికార్డ్ ల మీద రికార్డ్ లు కొట్టింది.. అవార్డ్ కూడా సాధించింది. ఇక  అయిపోయిందిలే అనుకున్న టైమ్ లో మరోసారి బుల్లితెరపై తన హవా చూపించింది బలగం. 
 

balagam movie achieve highest rating in television Second Time JMS


తెలంగాణ పల్లె సంసృతిని కళ్లకు కట్టినట్టు చూపించింది బలగం సినిమా. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద ఫలితాన్ని ఇచ్చింది  బలగం (Balagam). జబర్థస్త్  కమెడియన్ గాఎంతో పేరు తెచ్చుకున్న వేణు ఈ ఎమోషనల్ మూవీని తెరకెక్కించడం విశేషం.  జబర్దస్త్’ద్వారా ఎన్నో స్కిట్లతో బుల్లితెరపై, వెండితెరపై అలరించిన వేణు యెల్దండి తొలిసారిగా దర్శకత్వం వహించిన సినిమా బలగం. స్టార్ యాక్టర్ ప్రియదర్శి హీరోగా నటించగా... యంగ్ బ్యూటీ కావ్య కళ్యాణ్ రామ్  హీరోయిన్ గా అలరించింది. 

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించించిన  ఈ  సినిమా ఈ ఏడాది ప్రారంభంలో.. మార్చి 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సెన్సేషన్ గా మారింది. అంతే కాదు ఈసినిమా వరుసగా అవార్డ్ లు రివార్డ్ లు సాధించడంతో పాటు.. దాదాపు 100 కు పైగా అవార్డ్స్ ను తన ఖాతాలో వేసుకుంది. ఈసినిమా ఓటీటీలో కూడా అదే దూకుడు ప్రదర్శించగా.. గతంలో టీవీలో ప్రీమియర్ గా ప్రసారం అయ్యి.. భారీ టీఆర్ పీనిసాధించింది.  

ఇటీవల ఈ సినిమా స్టార్ మా ఛానెల్ లో ప్రసారం అయ్యింది. అందుకు సంబందించిన టీఆర్పీ రేటింగ్ తాజాగా వెలువడింది. ఈ మూవీ కి 14.3 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. సినిమా కి ఈ రేంజ్ రెస్పాన్స్ రావడం మామూలు విషయం కాదు. అయితే మొదటి సారి కాబట్టి ఇంత టీఆర్పీ వచ్చింది అనకుంటే.. చాలా కాలం తరువాత రీసెంట్ గా మారోసారి ఈసినిమా స్టార్ మాలో ప్రసారం అవ్వగా.. ఈసారి 8.42 రేటింగ్ ను సాధించింది. దాంతో ఈమూవీ మరోసారి హాట్ న్యూస్ అవుతోంది.   దిల్ రాజు ప్రొడక్షన్స్ పై నిర్మించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios