‘ఆర్ఆర్ఆర్’ రికార్డును బద్దలు కొట్టిన ‘బలగం’.. టీవీలోనూ సూపర్ రెస్పాన్స్.. టీఆర్పీ తెలిస్తే!

డైరెక్టర్ గా తొలిచిత్రం ‘బలగం’తో వేణు యెల్దండి సెన్సేషన్ క్రియేట్ చేశారు. థియేటర్లలో బ్రహ్మరథం పట్టిన ఈ చిత్రం తాజాగా టీవీలోనూ రికార్డు క్రియేట్ చేసింది. 
 

Balagam movie Achieve Highest Rating in Television NSK

తెలంగాణ కల్చర్ ను చూపిస్తూ చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘బలగం’ (Balagam). కమెడియన్ గా ఎన్నో చిత్రాలు, ‘జబర్దస్త్’ద్వారా ఎన్నో స్కిట్లతో బుల్లితెరపై, వెండితెరపై అలరించిన వేణు యెల్దండి తొలిసారిగా దర్శకత్వం వహించిన చిత్రమే బలగం. స్టార్ యాక్టర్ ప్రియదర్శి హీరోగా నటింంచారు. యంగ్ బ్యూటీ కావ్య కళ్యాణ్ రామ్ కథానాయిక. దిల్ రాజు నిర్మించారు. ఈ చిత్రం మార్చి 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సెన్సేషన్ గా మారింది. 

పల్లె వాతావరణం, కుటుంబ బంధాలు, అన్నాచెళ్లెల అనుబంధం, విలేజ్ మెటీరియల్ తో ప్రేక్షకుల మనస్సు గెలుచుకున్నారు. థియేటర్ల 50పైగా ఆడింది. ఆడియెన్స్ ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. మరోవైపు చిత్రంలోని ఎమోషనల్ సీన్స్, కుటుంబ నేపథ్య సన్నివేశాలు, తెలంగాణ ఆచారాలకు సంబంధించిన సందర్భాలు ఆడియెన్స్ చేత కంటతడి పెట్టించాయి. దీంతో ఈ చిత్రాన్ని ఊరూరా ప్రొజెక్టర్, తెరలు  ఏర్పాటు చేసి మరీ ప్రదర్శించారు. అంటే సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అయ్యిందో అర్థమవుతోంది. అటు బాక్సాఫీస్ వద్ద కూడా రూ.30 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

ఇక తాజాగా ఈ చిత్రాన్ని టీవీలోనూ  ప్రదర్శించడంతో ఊహించని రేటింగ్ ను సొంతం చేసుకుంది. ఏకంగా RRR రేటింగ్ నే దాటేసిందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. మే7న  ఈ చిత్రాన్ని స్టార్ మాలో  టెలికాస్ట్ చేశారు. తొలిసారిగా టీవీలో రావడంతో థియేటర్లలో మిస్ అయిన వారు, సినిమా నచ్చిన వారందరూ మరోసారి వీక్షించారు. దీంతో 14.3 రేటింగ్ దక్కించుకొని బుల్లితెరపైనా ‘బలగం’ సత్తా చాటింది. ఆర్ఆర్ఆర్ కు 19 రేటింగ్ రావడం విశేషం. హైదరాబాద్  నగరంలో బలగానికి 22  రేటింగ్ రేటింగ్ వచ్చినట్టు తెలుస్తోంది. 

మరోవైపు బలగం చిత్రం అవార్డుల పంట కూడా పండిస్తోంది. అంతర్జాయతీ స్థాయిలోనూ అవార్డులను సొంతం చేసుకుంటుండటం విశేషం.  40కిపైగా అవార్డులను సొంతం చేసుకుంది. ఇక ఈ ఏడాది జరుగుతున్న 13వ దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో (13th Dada Saheb Phalke International Film Festival) బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా అవార్డుని అందుకున్నాడు. ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఏకంగా 9 అవార్డులను సాధించింది. ఈ చిత్రాన్ని ఆస్కార్స్ కు కూడా పంపించే ప్రయత్నంలో ఉన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios