చిన్న సినిమాగా వచ్చి సంచలనం సృష్టించింది బలగం. చిన్న బడ్జెట్ తో భారీ వసూళ్లు సాధించింది సినిమా. ఎన్నో అవార్డ్ లు కూడా అందుకుంది. కాగా ఈసినిమాలో నటించిన పలువురు నటుల అనారోగ్యం గురించి గతంలో ఎన్నో వార్తల వచ్చాయి. తాజాగా బాలగం సినిమా లో నటించిన మరో సీనియర్ యాక్టర్ అనారోగ్యంతో మంచానపడ్డారు. సహాయం కోసం ఎదురుచూస్తున్నాడు.
జబర్థస్త్ ఫేమ్ వేణు యెల్డండి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా బలగం. గతంలో ఈసినిమా నటుడు మోగిలయ్య అనారోగ్యంతో ఎంత ఇబ్బందిపడ్డాదో అందరికి తెలిసిందే. తాజాగా ఈమూవీలో నటించిన మరో నటుడు అనారోగ్యంతో మంచం పట్టాడు. ఈ సినిమాలో కొమురయ్య తమ్ముడు అంజన్న పాత్రలో నటించిన జీవీ బాబు అనారోగ్యంతో ఇబ్బందపడుతున్నాడు. చాలా కాలంగా ఆయన మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. ప్రస్తుతం హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. కనీసం వైద్య ఖర్చులు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నాడు బాబు. మందుదు కొనడానికి డబ్బులు లేక ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నారు.
అయితే జీవీ బాబు ఫ్యామిలీ వారి స్థోమతకు తగ్గట్టుగా డబ్బులు కూడబెట్టి వరంగల్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అతనికి డయాలసిస్ చేయిస్తున్నారు. కాని ఇంకా మెరుగైన వైద్యం చేయించడానికి డబ్బులు లేక కుటుంబం ఇబ్బందులు పడుతుంది. దాంతో జీవీ బాబుకు మెరుగైన వైద్యం అందించాలని, దాతలు, కళాకారులు ఆర్థికసాయం అందించేందుకు ముందుకు రావాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నరు. అంతే కాదు తెలంగాణ నాటక సమాజాల సమాఖ్య అధ్యక్షుడు ఆకుల సదానందం కూడా ఒ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.
గతంలో బలగం సినిమా నటుడు, గాయకుడు మొగిలయ్యకు కూడా ఇలాంటి పరిస్థితి వస్తే.. ప్రభుత్వంతో పాటు చిరంజీవి లాంటి పలువురు స్టార్లు ఆదుకున్నారు. వైద్య ఖర్చులకు సాయం చేశారు. ఇక ప్రస్తుతం బాబు పరిస్థితి కూడా అలానే ఉండటంతో సహాయం కోసం ఎదురు చూస్తున్నాడు. వరంగల్ జిల్లా రామన్నపేటకు చెందిన గుడిబోయిన బాబు రంగస్థలం నుంచి నటుడిగా గుర్తింపు పొంది, సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ వస్తున్నాడు. బలగం సినిమాతో తన నటనకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాని అనారోగ్యంతో మంచానపడటంతో అవకాశాలు లేక ఆర్ధికంగా ఇబ్బందిపడుతున్నాడు. ప్రభుత్వం, దాతలు సానుకూలంగా స్పందించి గుడిబోయిన బాబుకు వైద్యం కోసం ఆర్థిక సహాయం చేయాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పందిస్తుందేమో అని ఎదురుచూస్తున్నారు.