టాలీవుడ్ లో ట్రెండ్ సెట్ చేసిన అర్జున్ రెడ్డి కథ తమిళంలో అడ్డం తీరుగుతోంది. రీమేక్ చిత్రం వర్మ షూటింగ్ దశలోనే నెగిటివ్ టాక్ బాగా వైరల్ అవుతోంది. తమిళంలో సెన్సేషనల్ దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు బాలా ప్రాజెక్టు నుంచి నిర్మాతలు తీసెయ్యడం వంటి వార్తలు కోలీవుడ్ లో అందరిని షాక్ కి గురి చేశాయి. 

అయితే ఈ విషయంపై ఫైనల్ గా దర్శకుడు బాలా ఒక క్లారిటీ ఇచ్చారు. సొంత నిర్ణయంతోనే సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు చెబుతూ ధృవ్ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఈ విషయంపై ఎక్కువగా మాట్లాడదలచుకోలేను అంటూ ప్రెస్ నెట్ రిలీజ్ చేశారు. మొత్తానికి బాలా నిర్మాతల స్టేట్ మెంట్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. 

సొంత ప్రొడక్షన్ హౌస్ ‘బి ఫిలిమ్స్’కు ‘వర్మ’ ప్రొడక్షన్ హౌజ్ ‘ఈ4 ఎంటర్టైన్మెంట్స్’కు మధ్య ఉన్న ఒప్పంద పత్రాన్నజతచేసి ఇక నుంచి వారితో భాగస్వామ్యం ఉండదని అన్నారు. క్రియేటివ్ డ్రీమ్ ను కాపాడుకావడనికే ఈ తరహాలో నిర్ణయం తీసుకున్నట్లు చెబుతూ ధృవ్ కెరీర్ దృష్ట్యా ఎక్కువగా మాట్లాడటం ఇష్టం లేదని ఇంతటితో దీనికి ఎండ్ కార్ట్ పెట్టేస్తున్నట్లు పేర్కొన్నారు.