బాహుబలి2 ట్రయలర్ రిలీజ్ ఫిబ్రవరికి వాయిదా జనవరి 26న రిలీజ్ కావల్సి ఉన్నా ఆలస్యం గ్రాఫిక్స్ వర్క్ పూర్తి చేయలేకపోయిన టీమ్ దీంతో ఆలస్యమైన ట్రయలర్ రిలీజ్
తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఘనత బాహుబలి సినిమాదే. అయితే బాహుబలి రెండో భాగం పై ప్రేక్షకుల్లో ఉత్కంఠ రోజురోజుకూ పెరుగుతోంది. దీనికి కారణం... రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటమే. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్నది యావన్మందిని వేధిస్తున్న ప్రశ్న. రకరకాల వెర్షన్లు పుట్టుకొచ్చినా ఏ ఒక్క వెర్షన్ ఇప్పటి వరకు కనీసం దగ్గరగా కూడా రాలేదట. అంతటి ట్విస్ట్ ఉన్న ఈ సినిమాపై రోజు రోజుకూ క్రేజ్ పెరుగుతోంది.
ప్రేక్షకుల్లో ఉన్న ఉత్కంఠ కాస్త చల్లార్చేందుకు జనవరి 26న ట్రయలర్ రిలీజ్ చేస్తారని అంతా భావించినా... అందరి ఆశలు గల్లంతు చేస్తూ సినిమా ట్రయలర్ రిలీజ్ వాయిదా వేశారు. మరింత క్యూరియాసిటీ పెంచేందుకే ఇలా చేశారని వినిపిస్తుంటే... టీమ్ మాత్రం గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కానందునే ట్రయలర్ రిలీజ్ చేయలేకపోతున్నామని అంటున్నారు. మొత్తంమీద బాహుబలి 2 ట్రయలర్ రిలీజ్ వాయిదా పడటంతో ప్రేక్షకుల్లో ఉత్కంఠ మరింత పెరుగుతోంది.
