బాహుబలి అభిమానులకు మరో బహుమతి ప్రభాస్ పుట్టినరోజుకు ఒకరోజు ముందే గిఫ్ట్ అందర్నీ ఊరించిన బాహుబలి2 ఫస్ట్ లుక్ విడుదల
బాహుబలికి సంబంధించిన అనేక విషయాలు అక్టోబర్ ఫస్ట్ వీక్ నుండి వరుసగా విడుదలవుతూ ఆడియన్స్ ను ఎగ్జయిట్ చేస్తునే ఉన్నాయి. బాహుబలి యానిమేటెడ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. ఇక టీవీ సీరీస్, కామిక్స్, బుక్స్, గేమ్స్ అన్నీ హయ్యస్ట్ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఇక ముంబై ఫిలింఫెస్ట్ సందర్భంగా బాహుబలితో వర్చువల్ రియాలిటీ ఎక్స్‌పీరియెన్స్ పరిచయం చేస్తున్నారు.
బాహుబలి థియేటర్లలో విడుదల కావడానికి నెల రోజుల ముందుగానే వర్చువల్ రియాలిటీ హై ఎండ్ ఎక్స్ పీరియన్స్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే మేకింగ్ వీడియోస్‌ని వర్చువల్ రియాలిటీలో హయ్యండ్ క్వాలిటీస్‌తో రూపొందిస్తున్నారు. ఇన్ని రకాల విశేషాలతో మరోసారి తెలుగు సినిమా స్టామినాను, వాల్యూను పెంచిన బాహుబలి2 ఎప్పుడు విడుదలవుతుందా అని ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పార్ట్ 1తో 600 కోట్ల కలెక్షన్స్ సాధించిన బాహుబలి మూవీ.. సెకండ్ పార్ట్ వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి రికార్డ్ క్రియేట్ చేయడం గ్యారంటీ అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.
