ఏప్రిల్ 7న బాహుబలి ఫ్యాషన్ షో.. ఎందుకంటే పలువురు డిజైనర్లతో రూపొందించిన బాహుబలి దుస్తుల ప్రదర్శన ఇకపై మార్కెట్ లో బాహుబలి దుస్తులు అందుబాట్లోకి తెచ్చేందుకు టీమ్ ప్లాన్
తెలుగు సినిమా చరిత్రను ప్రపంచ స్థాయికి చేర్చిన సినిమాగా బాహుబలి చిత్రం కీర్తింపబడుతున్నది అంటే దానికి కారణం చిత్ర టీమ్ ప్లాన్ చేసిన పబ్లిసిటీ రేంజ్ అనే చెప్పాలి. ఆ చిత్రంలో అ్బబుర పరిచే సీన్స్, ఫైట్స్, సాంగ్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉన్నా... పబ్లిసిటీ ఆ స్థాయిలో లేకుంటే కలెక్షన్లు ఈ రేంజ్ లో ఉండేవి కాదు.
ఈ సినిమా ప్రమోషన్ విషయంలో కొత్త కొత్త పంథాలతో సరికొత్త పాఠాలను నేర్పిన ఘనత బాహుబలి టీందే. గతంలో ఎన్నడూ లేని విధంగా బాహుబలి సినిమాను మీడియా మొత్తం నెత్తికెత్తుకునేలా చేశారు రాజమౌళి టీం. అలా వచ్చిన పబ్లిసిటీ కారణంగానే బాహుబలి సినమాకు ఇంతటి భారీ వసూళ్లు సాధ్యమయ్యాయి. అయితే తాజాగా బాహుబలి ది కంక్లూజన్ విషయంలో కూడా సరికొత్త పబ్లిసిటీ యాక్టివిటీస్ ను డిజైన్ చేస్తున్నారు.
దీంట్లో భాగంగా త్వరలో బాహుబలి థీంతో రూపొందించిన దుస్తులను మార్కెట్ లోకి ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతున్నారు. అనుపమా దయాల్, సౌరబ్ కాంత్ శ్రీవాస్తవ్, మృణాలినీ గుప్తా, యోగేష్ చౌదరి, అప్రజితా తూర్, సెలెక్స్ వంటి ప్రఖ్యాత డిజైనర్ లు ఈ దుస్తులను డిజైన్ చేస్తున్నారు. త్వరలోనే ఆన్ లైన్ లో అందుబాటులోకి రానున్న ఈ దుస్తులను ఏప్రిల్ 7న ఫ్యాషన్ షోను నిర్వహించనున్నారు. ఈ షోలో తమన్నా, రానాలు త్వరలో మార్కెట్ లోకి రానున్న ఈ దుస్తులను ప్రదర్శించనున్నారు.
