బాహుబలి ది కన్ క్లూజన్ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులు జక్కన్న కట్టప్పతో బాహుబలిని ఎందుకు చంపించాడా అనేది పెద్ద డౌట్ మార్చి 16న ట్రైలర్ రిలీజ్ చేస్తామని అధికారికంగా ప్రకటించిన రాజమౌళి

తెలుగు సినిమా కరిష్మాని ప్రపంచానికి చాటిచెప్పిన సినిమా బాహుబలి. అయితే బాహుబలికి సంబంధించి ఎంతో మందికి నిద్రపట్టని రాత్రులు మిగులుస్తున్న ఏకైక ప్రశ్న కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడా అని... అయితే ఆ సీక్రెట్ రివీల్ కావటానికి ఇంకెంతో దూరం లేదు. మరి కొన్ని రోజుల్లోనే... అంటే ఏప్రిల్ 28న రిలీజ్ కావాల్సిన సినిమా బాహుబలి. దానికి నెలకు మరో వారం 10 రోజుల తేడా. ఇక.. దీనికి సంబంధించిన ట్రైలర్ కోసం కూడా అంతా ఎదురుచూస్తున్న తరుణంలో జక్కన్న తాజాగా ట్రైలర్ రిలీజ్ డేట్ అఫీషియల్ గా ఎనౌన్స్ చేసేశాడు.

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న భారీ విజువల్ వండర్ బాహుబలి 2. ఇప్పటికే తొలి భాగంతో ఇండస్ట్రీ రికార్డ్లను తిరగరాసిన బాహుబలి 2తో మరోసారి బాక్సాఫీస్ మీదకు దండెత్తుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ మధ్యే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన బాహుబలి టీం ట్రైలర్ లాంచ్తో సినిమా మీద అంచనాలను పీక్స్కు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు.



తొలి భాగం కన్నా భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ కోసం సినీ అభిమానులతో పాటు ఇండస్ట్రీ ప్రముఖులు కూడా ఎదురుచూస్తున్నారు. ఇంత హైప్ క్రియేట్ చేస్తున్న బాహుబలి 2 ట్రైలర్ రిలీజ్కు ముహుర్తం ఫిక్స్ అయ్యింది. మార్చి 16న సెలెక్ట్ చేసిన కొన్ని థియేటర్స్లో ఉదయం 9 గంటలకు బాహుబలి 2 ట్రైలర్ను ప్రదర్శించనున్నారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు యూట్యూబ్లో రిలీజ్ చేయనున్నారు. బాహుబలి 2 ట్రైలర్ ఇప్పటి వరకు ఉన్న యూట్యూబ్ రికార్డ్స్ అన్నింటినీ చెరిపేస్తుందన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్.