బాహుబలి స్టార్స్ ప్ర‌భాస్‌, అనుష్క ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ... వారిపై నిజ‌జీవితంలో కూడా ప‌లు రూమ‌ర్లు పుట్టేలా చేసింది. వాళ్లిద్ద‌రి జంట సినిమాల‌లో చూడ‌ముచ్చ‌టగా ఉండ‌డం... ముఖ్యంగా సినిమా సూప‌ర్ హిట్ కొట్ట‌డం... వీరి పెయిర్‌పై అంత‌టా గుస‌గుస‌లు మొద‌ల‌య్యాయి. ఇక బాహుబలి రిలీజ్ తరువాత.. వారిద్ద‌రూ ప్రేమ‌లో ఉన్నార‌ని పెళ్లి చేసుకుంటార‌న్న‌ది ఇప్ప‌టికీ హాట్ టాపిక్కే. ఇప్పుడు వీరిపై మ‌రో రూమ‌ర్ చ‌క్క‌ర్లు కొడుతోంది. ప్ర‌భాస్ సాహో సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. అందుకే ఆ సినిమా బాలీవుడ్ బ్యూటీ శ్ర‌ధ్దా క‌పూర్‌ని హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నారు. కాగా అంత‌కుముందే అనుష్క‌కు కూడా బాలీవుడ్ చాన్స్ వ‌చ్చింద‌ని ... ప్ర‌భాసే ఆ సినిమా చేయ‌నివ్వ‌లేద‌ని ఫిల్మ్ న‌గ‌ర్లో టాక్. అనుష్క బాలీవుడ్ ఎంట్రీ త‌న ప‌క్క‌నే ఉండాల‌ని.. అది కూడా త‌మ బ్యాన‌ర్‌లోనే ఉండాల‌న్న కోరిక‌తో ప్ర‌భాస్... అనుష్క‌ను బాలీవుడ్ సినిమా చేయ‌కుండా ఆర్డర్లు వేసినట్లు రూమ‌ర్స్ వ‌చ్చాయి. ఇది ఎంత‌వ‌రకు నిజ‌మో వారిద్ద‌రికే తెలియాలి. 

 

అయినా అనుష్క‌ను తానే బాలీవుడ్‌కు ప‌రిచ‌యం చేయాల‌న్న కోరిక ప్ర‌భాస్‌కు ఉంటే.. సాహోలో ఆమెనే హీరోయిన్‌గా తీసుకోవ‌చ్చుగా అన్న వాద‌న కూడా వినిపిస్తోంది. అలా తీసుకోకుండా ఆమెను బాలీవుడ్ సినిమా చేయ‌ద్దంటూ ఎందుకు అడ్డుకుంటాడు అని వాదిస్తున్నారు కొంద‌రు ప్ర‌భాస్ అభిమానులు. అది నిజ‌మే క‌దా. కాక‌పోతో హీరో హీరోయిన్లిద్ద‌రూ కొత్త ముఖాలు అయితే... బాలీవుడ్ వాసులు చూడ‌ర‌ని ప్ర‌భాస్ మొద‌ట సినిమాకు శ్ర‌ధ్దాను తీసుకున్నాడ‌ని... కాస్త గుర్తింపు వ‌చ్చాక‌ త‌న సినిమాతోనే అనుష్క‌ను హీరోయిన్‌గా ప‌రిచ‌యం చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్నాడేమో అని మ‌రికొంద‌రు చ‌ర్చించుకుంటున్నారు.