అక్కడ బాహుబలి వంద కొట్టింది

bahubali running successfully in japan
Highlights

జపాన్ లో వంద రోజులు ఆడిన బాహుబలి

భారతీయ చలన చిత్ర చరిత్రలో బాహుబలి2 చిత్రం ఒక చరిత్ర. ఈ చిత్రం సృష్టించిన రికార్డులు, సాధించిన కలెక్షన్లు అనితర సాధ్యమైనవి. బాహుబలి 2 చిత్రం ఇండియాలోనే కాదు విదేశాల్లో కూడా రాణించింది. ఇప్పటికి రాణిస్తూనే ఉంది. బాహుబలి 2 చిత్రం విడుదలై దాదాపు ఏడాది గడుస్తున్నా సంచలనాలు ఆగడం లేదు. దర్శక ధీరుడు రాజమౌళి ఈ చిత్రాన్ని విజువల్ వండర్ గా తీర్చిదిద్దారు. బాహుబలి 2 చిత్రం భారతీయ చిత్ర పరిశ్రమలోనే బిగ్గెస్ట్ హిట్ అని నిస్సందేహంగా చెప్పవచ్చు. బాహుబలి 2 చిత్రం జపాన్ లో 100 రోజులకుపైగా ప్రదర్శించబడుతూ కొత్త చరిత్ర సృష్టిస్తోంది.

బాహుబలి 2 చిత్రం జపాన్ లో మంగళవారంతో  100 రోజులు పూర్తి చేసుకోవడం విశేషం.100 రోజులు దాటిన తరువాత కూడా ఈ చిత్రం అద్భుతంగా రాణిస్తోంది. ఈ చిత్రం జపాన్ లో 1.3 మిలియన్ డాలర్లు వసూలు చేసినట్లు నిర్మాత శోభు యార్లగడ్డ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.

loader