ఎన్టీఆర్ కోసం బాహుబలి టెక్నాలజీ!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 11, Aug 2018, 12:41 PM IST
bahubali effects for ntr biopic
Highlights

ఇప్పుడు బాలయ్య బరువు తగ్గాలని ఎంతగా వర్కవుట్ చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. అలాగని ఇప్పుడు ఉన్నట్లుగా బాలయ్యని తెరపై చూపించలేరు. దీనికోసం ఇప్పుడు బాహుబలిలో వాడిన టెక్నాలజీను వాడాలని డిసైడ్ చేసినట్లు తెలుస్తోంది.

బాహుబలి సినిమాలో హీరోయిన్ గా నటించిన అనుష్క బరువు తగ్గాలని  ప్రయత్నించి విఫలమైంది. దీంతో ఆమెను సన్నగా చూపించడం కోసం సీజీ ఎఫెక్ట్స్ ను వాడారు. టెక్నాలజీని ఉపయోగించుకొని లావుగా ఉన్నవాళ్లని స్లిమ్ గా ఎలా చూపించవచ్చని బాహుబలి సినిమా ద్వారా అర్ధమయింది. ఇప్పుడు అలాంటి టెక్నాలజీని ఎన్టీఆర్ సినిమా కోసం వాడబోతున్నారని సమాచారం.

ఈ మధ్య బాలకృష్ణ బాగా బొద్దుగా మారిపోయారు. 'పైసా వసూల్' సినిమాలో ఆయన చాలా లావుగా కనిపించారు. ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ లో ఆయనను యువకుడిగా చూపించాల్సిన పరిస్థితి కలిగింది. నిజానికి యవ్వన దశలో ఎన్టీఆర్ పాత్రలో ముందుగా శర్వానంద్ ని తీసుకోవాలనుకున్నారు. కానీ అభిమానులను దృష్టిలో పెట్టుకొని ఆ పాత్రలో బాలయ్యనే చూపించాలని నిర్ణయించుకున్నారు.

ఇప్పుడు బాలయ్య బరువు తగ్గాలని ఎంతగా వర్కవుట్ చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. అలాగని ఇప్పుడు ఉన్నట్లుగా బాలయ్యని తెరపై చూపించలేరు. దీనికోసం ఇప్పుడు బాహుబలిలో వాడిన టెక్నాలజీను వాడాలని డిసైడ్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో విద్యాబాలన్.. బసవతారకం పాత్రలో కనిపిస్తుండగా రానా, రకుల్ ప్రీత్ సింగ్, సుమంత్ వంటి తారలు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. 

loader