కలెక్షన్స రికార్డులు చెరిపేస్తున్న బాహుబలి 1000 కోట్లకు చేరువలో బాహుబలి కలెక్షన్లు ఇప్పటికే వారం రోజుల్లో రూ.860 కోట్ల వసూళ్లు బాహుబలి రెండు పార్ట్ లు కలిపి 2000కోట్లు చేరుతుందని అంచనా
బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ క్రియేట్ చేసి దూసుకెలుతున్న 'బాహుబలి-2' మూవీ బాక్సాఫీసు వద్ద ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసుకుంది. 6వ రోజుకే ఆమిర్ ఖాన్ పికె మూవీ సాధించిన రూ. 743 కోట్ల రికార్డు బద్దలు కొట్టి నెంబర్ వన్ గా నిలిచిన బాహుబలి... తొలి వారం పూర్తియ్యే సమయానికి రూ. 860 కోట్ల వసూళ్లు సాధించింది.
ఇప్పటి వరకు ఇండియన్ సినీ పరిశ్రమలో రూ. 1000 కోట్ల మార్కు అనేది ఎవరూ అందుకోని బ్రహ్మాండంగానే ఉండిపోయింది. ఇపుడు ఆ లక్ష్యాన్ని అవలీలగా ఛేదించే దిశగా 'బాహుబలి-2' అడుగులు వేస్తోంది. తొలి వారం రిపోర్ట్స్ ప్రకారం ఇప్పటి వరకు రూ. 860 కోట్లు నమోదు చేసిన ఈచిత్రం మరో రెండు రోజుల్లో రూ. 1000 కోట్ల మార్కును అందుకుంటుదని చెబుతున్నారు. ఇండియాలో పన్నులతో కలిపి నెట్ అమౌంట్ మొత్తం రూ. 695 కోట్లు బాహుబలిపై ఖర్చు పెట్టారు ప్రేక్షకులు. టాక్సులు, ఇతర ఖర్చులు పోను నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల చేతికి తొలివారం వసూళ్ల రూపంలో రూ. 545 కోట్లు వచ్చాయి. ఓవర్సీస్ ఈ సినిమాపై ప్రేక్షకులు రూ. 165 కోట్లు ఖర్చు పెట్టారు. మొత్తం కలిపితే తొలివారం గ్రాస్ కలెక్షన్ రూ. 860 కోట్లకు చేరిందని ట్రేడ్ అనలిస్ట్ లు చెప్తున్నారు.
బాహుబలి-2 నిర్మాణానికి నిర్మాతలు దాదాపు రూ. 250 కోట్లు ఖర్చు పెట్టారు. ఓవరాల్ బిజినెస్ లో ఈ సినిమా రూ. 1500 కోట్లకు తక్కువ కాకుండా గ్రాస్ వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. అంటే నిర్మాతలకు భారీ లాభాలే అన్నమాట. బాహుబలి-2 భారీ విజయం సాధిస్తుందని అంతా ముందే ఊహించారు కానీ... ఇండియాలో నెం.1 స్థానాన్ని అవలీలగా అందుకుని రూ. 1000 కోట్ల మార్కును సైతం దాటేసి అంతకు మించిన వసూళ్లతో సినిమా పెను ప్రభంజనం క్రియేట్ చేస్తుందని ఎవరూ ఊహించలేదు.బాహుబలి రెండు పార్టులు కలుపుకుంటే మొత్తం బిజినెస్ రూ. 2000 కోట్ల మార్కును అందుకుంటుందని అంచనాలున్నాయి. రెండు భాగాలు కలిపి బాహుబలి ఓవరాల్ బడ్జెట్ రూ. 450 కోట్లు ఖర్చుపెట్టనా సరే... నిర్మాతలకు కాసుల పంట పండటం ఖాయం. సాహో బాహుబలి.