సారాంశం

ప్రయోగాత్మక పాత్రలనే ఎంచుకునే రాకేష్‌.. తాజాగా `జితేందర్‌రెడ్డి` చిత్రంలో టైటిల్‌ రోల్‌ చేస్తున్నారు. తాజాగా ఆయన లుక్‌ని పరిచయం చేసింది యూనిట్‌. ఈ మేరకు కొత్త పోస్టర్‌ని విడుదల చేసింది. 

`బాహుబలి` చిత్రంతో ఆకట్టుకున్నాడు రాకేష్‌ వర్రే. ఇందులోభళ్లాలదేవ సైనికుడిగా, అనుష్క భుజం పట్టుకునే సీన్‌లో కనిపిస్తాడు. అందుకు అనుష్క అతని వేలిని కట్‌ చేస్తుంది. ఆ తర్వాత ప్రభాస్‌ ఏకంగా తలే తీసేస్తాడు. ఆ సీన్‌ సినిమాలో చాలా హైలైట్‌ అయ్యింది. ఇలాంటి చాలా సినిమాల్లో నెగటివ్‌ రోల్స్ చేసి మెప్పించాడు రాకేష్‌ వర్నే. దీంతోపాటు `ఎవ్వరికీ చెప్పొద్దు`తో హీరోగానూ ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. 

ప్రయోగాత్మక పాత్రలనే ఎంచుకునే రాకేష్‌.. తాజాగా `జితేందర్‌రెడ్డి` చిత్రంలో టైటిల్‌ రోల్‌ చేస్తున్నారు. తాజాగా ఆయన లుక్‌ని పరిచయం చేసింది యూనిట్‌. ఈ మేరకు కొత్త పోస్టర్‌ని విడుదల చేసింది. ఇందులో తుపాకీ పట్టుకుని పవర్‌ ఫుల్‌రోల్‌లో కనిపిస్తున్నారు రాకేష్‌. దీనిపై చిత్ర బృందం చెబుతూ, `కొద్దిరోజుల క్రితం `జితేందర్ రెడ్డి` అనే పేరుతో హీరో ఎవరో తెలియకుండా  పోస్టర్లు  రిలీజ్ చేశాం. పోస్టర్లు చూడడానికి చాలా powerfulగా ఉన్నప్పటికి అందులో ఉన్న కథానాయకుడు ఎవరు?, అసలు టైటిల్ లో ఉన్న ఈ జితేందర్ రెడ్డి ఎవరు? అని చర్చనీయాంశం  అయ్యింది. 

ఒక వ్యక్తి కొంత మంది జనాల ముందు కూర్చుని చిన్న పాప మీద చెయ్యి వేసి నాయకుడు శైలిలో కనిపిస్తాడు. కాని ఆ పోస్టర్ లో కూడా హీరో ఎవరు అనేది తెలియడం లేదు.  ఆ పోస్టర్ తో అసలు ఆ పాత్ర చెయ్యబోతున్న హీరో ఎవరు?, ఎందుకు అతన్ని దాచారు అని రకరకాల కథనాలు ఇండస్ట్రీలో వినిపించాయి. ఇప్పుడు ఆ సస్పెన్స్ ని రివీల్ చేస్తూ ఇంకో పోస్టర్ ని విడుదల చేశాం. జితేందర్ రెడ్డి పాత్రలో రాకేష్ వర్రే గన్ పట్టుకుని ఎంతో డైనమిక్ గా నడుచుకుంటూ వస్తున్నట్టు ఉంది. చూడడానికి ఒక యంగ్ పోలీస్ లాగా ఉన్నాడు. కాకపోతే ముందు రిలీస్ చేసిన పోస్టర్స్ లో  లీడర్ లుక్స్ ఉన్నాయి. 

 హీరోగా ఒక సినిమా చేసి హిట్ అందుకున్న తరు వాత కూడా ఇంత గ్యాప్ తీసుకుని ఈ `జితేందర్ రెడ్డి` సినిమానే  రాకేష్ ఎందుకు ఎంచుకున్నారు, అసలు ఈ కథలో, ఆ పాత్రలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? అనేది జితేందర్ రెడ్డి సినిమా గురించి మరిన్ని updates వచ్చే వరుకు వేచి చూడాల్సిందే` అని తెలిపింది యూనిట్‌. ఈ సినిమాలో శ్రీయ శరణ్‌, సుబ్బరాజు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. గోపీసుందర్‌ సంగీతం అందిస్తున్నారు. విరించి వర్మ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది.