ప్రభాస్ నటించిన `బాహుబలి 2` రికార్డులను బ్రేక్ చేసింది `పఠాన్`. షారూఖ్ ఖాన్ నటించిన ఈ సినిమా సరికొత్త రికార్డుని క్రియేట్ చేసింది. ఆ రికార్డుల విశేషాలను చూస్తే..
ప్రభాస్ నటించిన సంచలన చిత్రం `బాహుబలి`. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు రానా ముఖ్య పాత్ర పోషించారు. అనుష్క, తమన్నా కథానాయికలుగా, సత్యరాజ్, రమ్యకృష్ణ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి సంబంధించిన రెండో భాగం `బాహుబలి 2` సంచలన విజయం సాధించింది. ఇండియన్ సినిమాలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది.ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ.1800కోట్లు వసూలు చేసింది. ప్రపంచం ముందు ఇండియన్ సినిమా సత్తాని ముఖ్యంగా, తెలుగు సినిమా పవర్‌ని చూపించారు.
ఇండియాలో ఈ సినిమా 1050కోట్లు వసూలు చేయగా, హిందీ వర్షన్ 510 కోట్లు రాబట్టింది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఈ సినిమా రికార్డులను మరే మూవీ బ్రేక్ చేయలేదు. తాజాగా హిందీ మూవీ `పఠాన్` ఈ రికార్డులను బ్రేక్ చేసింది. ఈ చిత్రం హిందీ వర్షన్ `బాహుబలి2`ని దాటేసింది. ఇప్పటి వరకు ఈ సినిమా రూ.511కోట్లు వసూలు చేసింది. కేవలం హిందీ వర్షన్‌లో మాత్రమే `బాహుబలి 2` రికార్డులను బ్రేక్ చేసింది. దీంతో హిందీ వెర్షన్ లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది `పఠాన్.
ఇక ఓవరాల్‌గా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్లు చూస్తే, ఇప్పటి వరకు ఈ సినిమా వెయ్యి కోట్లు వసూలు చేసింది. దీంతో `బాహుబలి2`, `దంగల్`, `కేజీఎఫ్2`, `ఆర్‌ఆర్‌ఆర్` తర్వాత అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఇప్పటికీ ఇది థియేటర్లలో రన్ అవుతుండటం విశేషం. మామూలు అంచనాలతో వచ్చిన ఈ సినిమా వెయ్యి కోట్లకు రీచ్ కావడం సంచలనంగా చెప్పొచ్చు. కరోనాతో కుదీల పడ్డ బాలీవుడ్‌కి ఊపిరి పోసింది. ఆక్సిజన్ అందించింది.
షారూఖ్ ఖాన్ హీరోగా నటించిన `పఠాన్`లో దీపికా పదుకొనె కథానాయికగా నటించగా, సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ చేశారు. యాక్షన్ ఎంటర్ టైనర్‌గా సిద్ధార్థ్ ఆనంద్ రూపొందించిన ఈ సినిమా జనవరి 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.
