ఇండియన్ బాక్స్ ఆఫీస్ స్టామినాను విదేశాలకు చాటి చెప్పిన చిత్రం బాహుబలి. ఈ సినిమా విదేశాల్లో కూడా మంచి ఆదరణను అందుకుంది. ముఖ్యంగా జపాన్ లో పెద్ద స్థాయిలో అభిమానులను సంపాదించుకుంది. స్పెషల్ చిత్ర యూనిట్ ను సక్సెస్ సెలబ్రేషన్ లో భాగమయ్యేలా చేశారు అంటే సినిమా ఎంతగా సక్సెస్ అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. 

రీసెంట్ గా టోక్యో కామిక్ కాన్ లో జపాన్ అభిమానులు మద్యన రానా స్పెషల్ ఎట్రాక్షన్ గా దర్శనమిచ్చాడు. అంతే కాకుండా ఫ్యాన్స్ సమక్షంలో రెండు వారలా ముందుగానే బర్త్ డే కేక్ ను అడ్వాన్స్ గా కట్ చేశాడు. రాను అందుకు వారికి ఫిదా అయిపోయి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. స్టేడియం మొత్తంగా రానా పేరు మారు మ్రోగిపోయింది. 

జపాన్ లో బాహుబలికి ఇంతగా ఆదరణదక్కుతుందని ఎవరు ఊహించలేదు, ప్రస్తుతం అందుకు సంబందించిన ఫొటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జపాన్ అభిమానులు భల్లాల దేవకీ ఏ స్థాయిలో వెల్కమ్ చెప్పారో కింద ఉన్న వీడియో లింక్ లో చూడండి.