BAFTA ఫిలిం అవార్డ్స్ 2025 ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ అవార్డ్స్ లో హాలీవుడ్ నటుడు అడ్రియన్ బ్రాడీ ఉత్తమ నటుడిగా అవార్డు గెలుచుకున్నారు.బ్రిటిష్ అకాడమీ ఫిలిం అవార్డ్స్ 2025లో విజేతల పూర్తి లిస్ట్ ఇక్కడ ఉంది. 

BAFTA ఫిలిం అవార్డ్స్ 2025 ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ అవార్డ్స్ లో హాలీవుడ్ నటుడు అడ్రియన్ బ్రాడీ ఉత్తమ నటుడిగా అవార్డు గెలుచుకున్నారు. ఉత్తమ నటిగా మైకీ మాడిసన్ ఎంపికయ్యారు. ది బ్రూతలిస్ట్ చిత్రానికి గాను అడ్రియన్ కి అవార్డు దక్కింది. మైకీ మాడిసన్ కి అనోర చిత్రంలో నటనకి అవార్డు దక్కడం విశేషం. 

బ్రిటిష్ అకాడమీ ఫిలిం అవార్డ్స్ 2025లో కాన్క్లేవ్ చిత్రం ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఈ చిత్రాన్ని బెస్ట్ మూవీతో పాటు అనేక విభాగాల్లో అవార్డులు దక్కాయి. అవుట్ స్టాండింగ్ బ్రిటిష్ ఫిలిం కేటగిరిలో కూడా ఈ చిత్రం విజేతగా నిలిచింది. బ్రిటిష్ అకాడమీ ఫిలిం అవార్డ్స్ 2025లో విజేతల పూర్తి లిస్ట్ ఇక్కడ ఉంది. 

ఉత్తమ చిత్రం : కాన్క్లేవ్ 

అవుట్ స్టాండింగ్ బ్రిటిష్ ఫిలిం : కాన్క్లేవ్ 

ఉత్తమ దర్శకుడు : బ్రాడీ కార్బెట్ ( ది బ్రూతలిస్ట్ మూవీ )

ఒరిజినల్ స్క్రీన్ ప్లే : జెస్సీ ఐసెన్ బర్గ్ (ఎ రియల్ పెయిన్ )

లీడింగ్ యాక్ట్రెస్ : మైకీ మాడిసన్ ( అనోరా)

లీడింగ్ యాక్టర్ : అడ్రియన్ బ్రాడీ ( ది బ్రూతలిస్ట్ మూవీ )

ఉత్తమ సహాయ నటి : జో సల్దానా (ఏమిలా పెరెజ్ )

ఉత్తమ సహాయ నటుడు : కిరన్ కల్కిన్ (ఎ రియల్ పెయిన్ )

యానిమేటెడ్ ఫిలిమ్ : వేగన్స్ మోస్ట్ ఫౌల్ 

ఈ చిత్రం ఉత్తమ యానిమేటెడ్ చిత్రంగా నిలవడమే కాదు.. దర్శకుడు మెర్లిన్ కి పలు విభాగాల్లో అవార్డులు వచ్చాయి. 

ఉత్తమ డెబ్యూ దర్శకుడు, రచయిత : రిచ్ పెప్పియట్ (నీ కాప్ చిత్రం )

ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం : ది క్రిస్టఫర్ రీవ్ స్టోరీ 

ఉత్తమ సినిమాటోగ్రఫీ : లోల్ క్రౌలీ ( ది బ్రూతలిస్ట్ )

బెస్ట్ ఎడిటర్ : నిక్ ఎమెర్సన్ (కాన్క్లేవ్ )

బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ : పౌల్ టాజ్వెల్ ( వికెడ్ )

బెస్ట్ ఒరిజినల్ స్కోర్ :డానియల్ బ్లుమ్బెర్గ్ (ది బ్రూతలిస్ట్ )

బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ : నాథన్ క్రోలి, లీ సాండిల్స్ (వికెడ్ )

విజువల్ ఎఫెక్ట్స్ : పౌల్ లాంబెర్ట్, స్టీఫెన్ జేమ్స్, గేర్డ్ నెఫ్జెర్, రైస్ సెల్కమ్బ్ ( డ్యూన్ పార్ట్ 2)

ఉత్తమ బ్రిటిష్ షార్ట్ ఫిలిం : రాక్, సీసర్స్, పేపర్ చిత్రాలు ఉత్తమ షార్ట్ ఫిలిమ్స్ గా నిలిచాయి.