ప్రభాస్‌ తన అభిమానులకు వరుసగా షాక్‌లిస్తున్నాడు. ఇప్పుడు బ్యాక్‌ టూ బ్యాక్‌ డిజప్పాయింట్‌ చేస్తున్నారు. ఇప్పుడు డార్లింగ్‌ మరో సినిమా కూడా వాయిదా పడబోతుందట. 

ప్రభాస్‌ ఫ్యాన్స్ కి షాక్‌ ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఆయన నటించిన సినిమాలు వాయిదా పడుతున్నాయి. ఓవైపు అప్‌డేట్లు రాలేదనే బాధ, మరోవైపు సినిమాలు వాయిదా పడుతున్నాయనే బాధ. వాళ్లకి అన్ని రకాలుగా నిరాశే ఎదురవుతుంది. ఇప్పుడు బ్యాక్‌ టూ బ్యాక్‌ షాక్‌లు తగులుతున్నాయి. ప్రభాస్‌ నటిస్తున్న `ఆదిపురుష్‌` చిత్రం వాయిదా పడిన విషయం తెలిసిందే. సంక్రాంతికి రిలీజ్‌ కావాల్సిన ఈ సినిమా జూన్‌కి వెళ్లిపోయింది. వీఎఫ్‌ఎక్స్ లో క్వాలిటీ కోసం సినిమాని వాయిదా వేసినట్టు సమాచారం. 

ఇదిలా ఉంటే ఇప్పుడు మరో సినిమా వాయిదా పడేలా ఉందని తెలుస్తుంది. ప్రభాస్‌ నటిస్తున్న మరో భారీ చిత్రం `సలార్‌`. `కేజీఎఫ్‌` చిత్రాలతో సంచలనాలు సృష్టించిన ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. కోల్‌ మైనింగ్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో కార్మికుల నాయకుడు సలార్‌ పాత్రలో ప్రభాస్‌ కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. 

ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌లో విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ చిత్రం వాయిదా పడుతున్నట్టు సమాచారం. `ఆదిపురుష్‌` కారణంగా ఈ సినిమాని వాయిదా వేస్తున్నారనే వార్త ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతుంది. జూన్‌, ఆగస్ట్ కి మధ్యరెండు నెలలే ఉంటుంది. పాన్‌ ఇండియా రేంజ్‌ చిత్రాలు, పైగా ఒకే హీరో సినిమాలు బ్యాక్‌ టూ బ్యాక్‌ వస్తే అది మార్కెట్‌ పరంగా దెబ్బ పడుతుందనే ఉద్దేశ్యంతో సినిమాని వాయిదా వేస్తున్నారనే టాక్‌ వినిపిస్తుంది.

అయితే కేవలం `ఆదిపురుష్‌` కారణంగానా లేక షూటింగ్‌ కోసం సినిమాని వాయిదా వేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. నిజంగానే `సలార్‌` సెప్టెంబర్‌ నుంచి వెళ్లిపోతే 2024 సంక్రాంతికి వచ్చే అవకాశాలున్నాయి. మరి ఇందులో నిజాలేంటనేది తెలియాల్సి ఉంది. ఇందులో శృతి హాసన్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ విలన్‌గా నటిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్‌ ఈసినిమాని నిర్మిస్తుంది. 

ఇదిలా ఉంటే ప్రభాస్‌ నటిస్తున్న నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో `ప్రాజెక్ట్‌ కే` చేస్తున్న విషయం తెలిసిందే. సైన్స్ ఫిక్షన్‌ నేపథ్యంలో టైమ్‌ ట్రావెల్‌ కథతో ఈ చిత్రం రూపొందుతుందని తెలుస్తుంది. అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రలో నటిస్తుండగా, దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్‌ కి సమ్మర్‌గానీ, దసరా టైమ్‌లోగానీ విడుదల చేయాలనుకున్నారు. కానీ `ఆదిపురుష్‌` కారణంగా ఈ సినిమా కూడా వెనక్కి తగ్గే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.