`బేబీ` సినిమాని విజయవంతంగా రన్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కలెక్షన్ల పరంగానూ దుమ్మురేపుతుంది. రెండు రోజుల్లో ఇది భారీ కలెక్షన్లని సాధించడం విశేషం.
`బేబీ` మూవీ ఇప్పుడు తెలుగులో చిన్న సినిమాల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఈ సినిమాకి ప్రీమియర్స్ నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. కలెక్షన్ల పరంగానూ దుమ్మురేపుతుంది. ఈ సినిమా మొదటి రోజు ఏడు కోట్లకు పైగా కలెక్షన్లని రాబట్టింది. రెండో రోజు కూడా అదే మెయింటేన్ చేసింది. రెండు రోజుల్లో ఈ సినిమా ఏకంగా 14కోట్లు దాటింది(14.3కోట్లు). ఈ లెక్కన ఈ సినిమాకి దాదాపు ఎనిమిది కోట్ల షేర్ వచ్చిందని చెప్పొచ్చు. బ్రేక్ ఈవెన్‌కి బార్డర్ కి చేరుకుంది. `బేబీ` సుమారు ఏడున్నర కోట్లకి అమ్ముడు పోయిందని సమాచారం. ఈ లెక్కన ఇది బ్రేక్ ఈవెన్‌కి చేరుకుంది.
అయితే నైజాంలో మాత్రం బ్రేక్ దాటేసిందని తెలుస్తుంది. నైజాంలో రెండు కోట్ల 54లక్షలతో బ్రేక్ ఈవెన్ దాటేసిందట. మిగిలిన చోట్ల బార్డర్‌కి చేరుకుందని, ఆదివారంతో కొన్న బయ్యర్లంతా లాభాల్లోకి వెళ్తారని తెలుస్తుంది. ఈ సినిమా లాంగ్ రన్‌లో ఇరవై కోట్ల(షేర్) దాటేసే అవకాశం ఉంది. ఈ రకంగా అటు నిర్మాతలు, కొన్న బయ్యర్లకి పండగే అని చెప్పొచ్చు. `బేబీ` అందరికి లాభాల పంట పండిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
దీనికి డిజిటల్ రైట్స్ అదనం. దాదాపు 8కోట్లకి `ఆహా` ఈ సినిమాని ఓటీటీ రైట్స్ ని దక్కించుకుందని తెలుస్తుంది. మొత్తానికి `బేబీ` నిర్మాతలకు భారీ లాభాలను తీసుకురాబోతుందని, ఈ ఏడాది పెద్ద హిట్ చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు విశ్లేషకులు. బోల్డ్ కంటెంట్‌తో రూపొందింది `బేబీ`. లవ్ స్టోరీకి యువత పోకడలను మేళవించి రూపొందించారు దర్శకుడు సాయి రాజేష్. నేటి ట్రెండ్‌ని ఫాలో అవుతూ హార్ట్ టచ్చింగ్ డైలాగులు, పిచ్చెక్కించే సీన్లతో యువతకి కనెక్ట్ అయ్యేలా ఈ సినిమాని తీర్చిదిద్దారు.
దీనికి నటీనటులు వైష్ణవీ చైతన్య, ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ నటన ప్లస్ అయ్యింది. అలాగే మ్యూజిక్ మరో పెద్ద బలం. కెమెరా వర్క్, నిర్మాత విలువలు ఇలా అన్నీ తోడయ్యాయి. అన్ని కలిసి ఈ సినిమాని పెద్ద హిట్ చేశాయని చెప్పొచ్చు. యువతకు నచ్చే అంశాలుండటంతో యూత్ దీనికి కనెక్ట్ అయ్యారు. వాళ్లే సినిమాని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆనంద్, వైష్ణవి, విరాజ్ ప్రధాన పాత్రల్లో సాయి రాజేష్ దర్శకత్వంలో మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఎస్‌కేఎన్ నిర్మించిన `బేబీ` చిత్రం ఈ నెల 14న విడుదలైన విషయం తెలిసిందే.
ఏరియా వైజ్ రెండో రోజుల కలెక్షన్ల వివరాలు..
AREA GROSS
Nizam 5,08,16,396
Vizag 1,73,53,319
East 83,05,086
West 46,09,339
Krishna 74,99,963
Guntur 61,46,357
Nellore 37,77,814
Ceded 1,18,08,414
Karnataka +ROI 43,86,421
Overseas 2,84,00,000
TOTAL 14,31,03,109
