ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి..  బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది  బేబి సినిమా.. అంతే కాదు రెండు తెలుగు రాస్ట్రాలలో సంచలనంగా మారింది మూవీ. ఇక తాజాగా ఈ సినిమా 50 రోజులు పూర్తి చేసుకుంది. 

ఈమధ్య చిన్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతున్నాయి. ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి సంచలనాలు సృష్టిస్తున్నాయి. అలా వచ్చిన వాటిలో బేబి సినిమా కూడా ఉంది. కలర్ ఫొటోతో నేషనల్ అవార్డు అందుకున్న దర్శక,నిర్మాత సాయి రాజేశ్ డైరెక్ట్ చేసిన యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ బేబీ. శ్రీనివాస కుమార్ నిర్మించిన ఈసినిమాలో ఆనంద్ దేవరకొండ , వైష్ణవి చైతన్య , విరాజ్ అశ్విన్ లు లీడ్ రోల్స్ చేశారు. ఈ సినిమాలో హీరోల పాత్రకంటే.. బెబిగా వైష్ణవి పాత్రకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. 

ఎటువంటి అంచనాలు లేకుండా ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయిన బేబి.. బాక్సాఫీస్ ను శేక్ చేసి.. టాలీవుడ్ లో ప్రభంజనం సృష్టించింది. అటు ఆడియన్స్ ప్రేమను పొందడంతో పాటు.. సెలబ్రిటీస్ ప్రశంసలు కూడా తెచ్చి పెట్టింది. ఇక కలెక్షన్స్ పరంగా సునామీ సృష్టించింది. రీసెంట్ గా 90 కోట్ల‌ మార్క్ ని టచ్ చేసిన బేబి... 100 కోట్లకు చాలా దగ్గరిలో ఉంది. అంతే కాదు.. ఇప్పటికే ఓటీటీల్ స్ట్రీమింగ్ అయిన బేబి సినిమా అటు థియేటర్ లో కూడా ఇంకా సందడి చేస్తూనే ఉంది. ఓటీటీలో కూడా రికార్డ్స్ క్రియేట్ చేసిన ఈసినిమా.. ఆహాలో.. ఇప్పటికే.. 32 గంటల్లోనే 100 మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్ సాధించి సంచలనం సృష్టించింది. 

అంతే కాదు .. ఓటీటీకి వచ్చినా కూడా థియేటర్స్ లో ఇంకా సందడి చేస్తున్న సినిమాగా నిలిచిపోయింది బేబి సినిమా. ఇక తాజాగా ఈ చిత్రం 50 రోజులు మైలు రాయిని చేరుకుంది. రెండు మూడు వారలు మాత్రమే థియేటర్స్ లో సినిమాలు సందడి చేస్తున్న తరుణంలో ఒక చిన్న సినిమా 50 రోజులు పండుగా చేసుకోవడం విశేషం. కడప, కర్నూలు, అనకాపల్లి లాంటి చోట్ల ఈ చిత్రం డైరెక్ట్ 50 రోజులు రన్ పూర్తి చేసుకుంది. ఇలా 100 కోట్లు కలెక్షన్స్, 100 మిలియన్ వ్యూస్, 50 రోజులు పండుగాతో మూవీ టీం ఫుల్ హ్యాపీగా ఉంది. దర్శకుడు సాయి రాజేష్ ప్రేక్షకులకు సోషల్ మీడియా ద్వారా థాంక్యూ చెప్పాడు. ఈ మూవీ కోసం పని చేసిన ప్రతి ఒక్కరి కెరీర్ కి మీరు బిగ్గెస్ట్ బ్రేక్ ఇచ్చారంటూ కృతజ్ఞతలు తెలియజేశాడు.