ఆనంద్ దేవరకొండ నటించిన బేబీ చిత్రం శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ప్రీమియర్ షోల నుంచే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ మొదలైంది. సాయి రాజేష్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఎస్ కె ఎన్ నిర్మించారు.
ఆనంద్ దేవరకొండ నటించిన బేబీ చిత్రం శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ప్రీమియర్ షోల నుంచే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ మొదలైంది. సాయి రాజేష్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఎస్ కె ఎన్ నిర్మించారు. విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ తొలి హిట్ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో బేబీ మూవీ రూపంలో ఆ దాహం తీరింది. చిన్న దేవరకొండకి తొలి హిట్ లభించింది.
ఆనంద్ దేవరకొండతో పాటు ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన యంగ్ బ్యూటీ వైష్ణవి చైతన్య యువతలో క్రేజీగా మారింది. సోషల్ మీడియాలో వైష్ణవి గురించే నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన వైష్ణవి.. ప్రస్తుతం బేబీ చిత్ర విజయంతో టాలీవుడ్ లో సూపర్ క్రేజ్ సొంతం చేసుకుంది.

బేబీ విజయం తర్వాత వైష్ణవి తొలిసారి అమ్మవారికి బోనమెత్తింది. బంగారు బోనమెత్తి అమ్మవారి మొక్కు తీర్చుకుంది. బేబీ రిలీజ్ కి ముందు సికింద్రాబాద్ లో ఉజ్జయిని అమ్మవారికి వైష్ణవి బొనమెత్తింది. ఇప్పుడు మరోసారి బోనమెత్తి అమ్మవారిని దర్శించుకుంది. గతానికి ఇప్పటికి తేడా ఏంటి అని అడగగా.. గతంలో క్యూలో నిలబడి అమ్మవారిని దర్శించుకునేదాన్ని.. ఇప్పుడు స్పెషల్ గా దర్శనం చేయిస్తున్నారు అంటూ వైష్ణవి క్రేజీ కామెంట్స్ చేసింది.
బేబీ చిత్రానికి వైష్ణవి హీరోయిన్ గా ఎంపికైనప్పుడు.. యూట్యూబర్ హీరోయిన్ ఏంటి అనే కామెంట్స్ వినిపించాయి. ఆ కామెంట్స్ కి ఇప్పుడు తన నటన, విజయం తో వైష్ణవి సమాధానం ఇచ్చింది. బేబీ చిత్రానికి ముందు వైష్ణవి యూట్యూబ్ వీడియోస్ తో పాటు షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించింది.
సాయి రాజేష్ దర్శకత్వంలో ఎస్ కె ఎన్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తూ మంచి లాభాలు తెచ్చిపెడుతోంది. రెండు రోజుల్లోనే ఈ చిన్న చిత్రం 14 కోట్ల వరకు వసూళ్లు సాధించి పెద్ద విజయం దిశగా దూసుకుపోతోంది.
