అందుకోసం తనకి ఎక్కడెక్కడో వున్న ల్యాండ్ తనకా పెట్టి, చిరంజీవికి పారితోషికం ఇచ్చాడన్న వార్తని ప్రచారం లోకి తెచ్చారు. అయితే సినిమాకు ఫ్లాప్ టాక్ రావడంతో దాన్ని అడ్డం పెట్టి,..
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)కి 'భోళా శంకర్' డిజాస్టర్ అయ్యిందనేది నిజం. ఈ నేపథ్యంలో దర్శక - నిర్మాతల ఎంపిక, భోళా శంకర్ కథ,కథనం, చిత్రణపై పలు విమర్శలు వస్తున్నాయి. అది కామన్ గా జరిగే విషయంకూడాను. అయితే... ఎవరూ ఊహించని రూమర్ ఒకటి మీడియా లో స్ప్రెడ్ అవటం మొదలైంది. 'భోళా శంకర్' రిజల్ట్ వచ్చిన తర్వాత... సినిమా విడుదలకు ముందు నిర్మాత అనిల్ సుంకర (Anil Sunkara) ముక్కు పిండి మరీ చిరంజీవి తన పారితోషికం అంతా వసూలు చేశారని ఓ సెక్షన్ ఆఫ్ మీడియా, సోషల్ మీడియా ప్రచారం చేయడం మొదలు పెట్టింది. నిర్మాత అనిల్ సుంకర (AnilSunkara) అందుకోసం తనకి ఎక్కడెక్కడో వున్న ల్యాండ్ తనకా పెట్టి, చిరంజీవికి పారితోషికం ఇచ్చాడన్న వార్తని ప్రచారం లోకి తెచ్చారు. అయితే సినిమాకు ఫ్లాప్ టాక్ రావడంతో దాన్ని అడ్డం పెట్టి, పనిగట్టుకుని మరీ చిరంజీవి ఇమేజ్ డ్యామేజ్ చేసే ప్రయత్నాలు కొంత మంది చేస్తున్నారని ఈ వార్తలు సరిగ్గా చదివితే అర్దమవుతుంది.
ఈ విషయమై చిరంజీవి వీరాభిమాని, రీసెంట్ గా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన 'బేబీ' #Baby దర్శకుడు సాయి రాజేష్ (SaiRajesh) చాలా క్లియర్ గా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు చిరంజీవి గురించి. ఇకనైనా చిరంజీవి మీద ఆరోపణలు ఆపండి, సినిమా బాగోలేకపోతే, బాగోలేదు అని చెప్పండి, అంతే కానీ అందులో నటించిన చిరంజీవి మీద ఇష్టం వచ్చిన రీతిలో మీకు తోచిన విధంగా ఏది పడితే అది రాయకండి అంటూరాసుకొచ్చారు. అలాగే ఈ వార్తలపై సాయి రాజేష్ ఓ రేంజ్ లో ఫైరయ్యాడు. నిజం చెప్పులేసుకునే లోపు అబద్దం ఊరంతా చుట్టేస్తోంది. ఇంకో వారం రోజులపాటు చిరంజీవి ముక్కుపిండి నిర్మాత నుండి ఎలా వసూలు చేసాడో అనేది రకరకాల వార్తలు వస్తాయి. ఇటు పక్క ఎలాగో నిజం చెప్పే మనిషి ఉండడు.

మేము మెగాస్టార్ చిరు గారి ఆఫీస్ లో ఉన్నప్పుడు అనిల్ సుంకరు గారు వస్తే ఆయన్ని వెయిట్ చేయించాడని తెలిసి పిలిచి పైకి రాగానే ఆయనే ఐరెన్ సోఫా జరిపి మరీ కూర్చోబెట్టారు. పని మనిషి తీసుకొచ్చిన కాఫీని ఆయన మా ముగ్గురికి అందించారు. నిర్మాతలకి ఆయనిచ్చే మర్యాద అలాంటిది. ఈ వార్తలని చూసి చాలా బాధతో నేను అనిల్ గారు దగ్గర పని చేసే ఒక వ్యక్తికి ఫోన్ చేసి అడిగి విషయం తెలుసుకున్నాను. మా బాస్ మీరనుకున్నట్లుగా కాదు. ఆయన వేరే. మా బాస్ చిరంజీవి గారిని చూసి నేను గర్వపడుతున్నాను అంటూ సాయి రాజేష్ చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది.
