బేబీ సినిమా నటికి వేధింపులు, ఫాలో అవుతూ..అత్యాచార బెదిరింపులు..
ఈమధ్య సినిమా నటులకు వేధింపులు ఎక్కువైపోయాయి. ముఖ్యంగా కొత్తగా ఫేమస్ అయిన వారికైతే.. వేధింపులు తప్పడంలేదు. తాజాగా బేబీ సినిమా నటికి వేధింపులు తప్పలేదు.

రీసెంట్ గా రిలీజ్ అయిన బేబీ సినిమా ప్రస్తుతం యూత్‌కు బాగా కిక్కెక్కించింది. రిలీజ్ అయ్యి పదిరోజులకు పైనే అవుతున్నా.. ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు బేబీ సినిమాకు. అంతే కాదు లో బడ్జెట్ లో తీసిన ఈసినిమా ఇప్పటి వరకూ 70 కోట్లకు దగ్గరగా వసూలు చేసింది. ఈసినిమా వల్ల ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్‌లకు అదిరిపోయే లాభాలు వస్తున్నాయి. పెద్ద సినిమాలు సైతం తీసుకురాని లాభాలను బేబి సినిమా తెచ్చిపెడుతుంది.
ఇక ఇది ఇలా ఉంటే.. ఈసినిమాలో యాక్టర్స్ కు ఎక్కడ లేనీ క్రేజ్ వచ్చిపడింది. ఆనంద్ దేవరకొండతో పాటు నటించిన రెండు పాత్రలకు విపరీతమైన క్ే్ వచ్చింది. ఈ సినిమాలో ముగ్గురు మేయిన్ లీడ్స్ తర్వాత ఎక్కువగా గుర్తుండే పాత్ర సీతది. వైష్ణవి ఫ్రెండ్‌గా కాస్త నెగెటీవ్ షెడ్స్ ఉన్న పాత్రలో మెప్పించింది. అయితే ఈసీత పాత్ర కనిపించింది కాసేపే అయినా.. సినిమా మొత్తం ఇంపాక్ట్ మాత్రం గట్టిగా ఉంటుంది. అయితే సీత పాత్ర నెగెటీవ్ ది కావడంతో.. జనాలు ఆమె పాత్రను గట్టిగా తిట్టుకుంటున్నారు. ఈ అనుభవాలు తనుకు డైరెక్ట్ గా ఎదురవుతున్నాయి అంటోంది బ్యూటీ. తాజాగా ఇదే విషయాన్ని వెల్లడించింది నటి. బేబీ సినిమా తర్వాత తనకు వేధింపులు పెరిగాయని అంటోంది.
అంతే కాదు కొంత మంది అయితే రేప్ చేసి.. చంపేస్తామని బెదిరించారని వాపోతోంది. బెదిరించడమే కాదు కొందరు ట్రై చేశారంటోంది. ఓ రోజు తను ఈవెంట్ నుంచి వస్తుంటే కొంత మంది అబ్బాయిలు వెంటపడి ఇలా బెదిరించారని, దాంతో వాళ్ల గురించి పోలిసులకు చెప్పమని తన ఫ్రెండ్స్ అన్నారని చెప్పింది.కానీ తను అలా చేయలేదని, వాళ్లంతా తన రీల్ లైఫ్ క్యారెక్టర్‌ను చూసి అలా అంటున్నారని, అందుకే వారిని పట్టించుకోలేదని ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా సినిమా తర్వాత ఇలాంటివి జరుగుతాయని సాయి రాజేష్ ముందే చెప్పాడని తెలిపింది. ఇక సీత గతంలో పలు షార్ట్ ఫిలింస్‌లో నటించింది. బేబీ సినిమాతో బాగా ఫేమస్ అయ్యింది సీత, ముందు ముందు మంచి మంచి అవకాశాలు కూడా అందుకోబోతుంది.