కౌశల్ ఆర్మీపై పరోక్షంగా కామెంట్స్ చేసిన బాబు గోగినేని!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 16, Aug 2018, 11:34 AM IST
babu gogineni comments on kaushal army
Highlights

బిగ్ బాస్ హౌస్ అనేది సైకలాజికల్ ప్రెషర్ కుక్కర్. అందులో మనం బతకగలమా..? లేదా..? అనేది షోకి వెళ్లిన ప్రతి ఒక్కరికీ తెలుసుకునే ఛాన్స్ ఉంది. అక్కడ సరిగ్గా ఆహారం ఉండదు. నిద్ర సరిపోదు

బిగ్ బాస్ హౌస్ నుండి గత వారం బయటకి వచ్చేసిన బాబు గోగినేని ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారా..? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన బిగ్ బాస్ షోపై అలానే పరోక్షంగా కౌశల్ ఆర్మీపై కామెంట్స్ చేశారు. ఆర్మీ మీద ఇంట్రెస్ట్ ఉంటే  భారత సైనిక దళంలో చేరమని సలహాలు ఇచ్చారు. ''బిగ్ బాస్ హౌస్ అనేది సైకలాజికల్ ప్రెషర్ కుక్కర్. అందులో మనం బతకగలమా..? లేదా..? అనేది షోకి వెళ్లిన ప్రతి ఒక్కరికీ తెలుసుకునే ఛాన్స్ ఉంది.

అక్కడ సరిగ్గా ఆహారం ఉండదు. నిద్ర సరిపోదు. అక్కడకి వెళ్లిన వారందరూ కూడా బరువు తగ్గారు. మగాళ్లకు ఎమోషన్స్ ఉండవని అందరూ అనుకుంటారని దానికోసం బిగ్ బాస్ నలుగురిని ఏడవమన్నారు. అది విని నాకు నవ్వొచ్చింది. హౌస్ మేట్స్ లో కొందరిని అడాప్ట్ చేసుకొని వారినే గెలిపించడానికి ఆర్మీలు తయారయ్యాయి. అంత ఆసక్తిగా ఉంటే భారత సైన్యంలో చేరి సేవలు చేయొచ్చు కదా..

దేశానికి ఉపయోగపడుతుంది. ఇదొక షో.. అందులో ఎవరు గెలిస్తే ఏంటి..? వ్యక్తిగత దూషణలు ఎందుకు..? ఒకరినొకరు విమర్శించుకోవచ్చు. అవతలి వ్యక్తి నచ్చకపోతే చెప్పొచ్చు. తప్పులు చేస్తే ఎక్కడ చేశామో తెలుసుకోవాలి. ప్రెషర్ లో కూడా తప్పులు చేయకపోతే చప్పట్లు కొడతాం'' అంటూ చెప్పుకొచ్చారు. 

loader