సాధారణంగా సినిమావాళ్లకు సెంటిమెంట్స్ ఎక్కువ. అలాగని అందరికీ ఉంటాయనుకోలేం. కొందరు ఇలాంటివాటికి దూరం. వారిలో రాజమౌళి ఒకరని చెప్తారు. అయితే ఆయన కూడా సెంటిమెంట్స్ ని ఫాలో అవుతున్నారా అంటే అవుననే వినపడుతోంది. తన కెరీర్ లో ఫెయిల్యూర్ ని చూడని ఆయన సినిమాల్లో మదర్ సెంటిమెంట్ వంటి వాటికి ప్రాధాన్యత ఇస్తారు కానీ, సినిమావాళ్లు రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాటికి  ప్రయారిటీ ఇవ్వరు. కానీ ఈ సారి ఆయన కూడా వాళ్ల రూట్ లోనే వెళ్తున్నారట. తన కొత్త చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ కోసం ఒక లొకేషన్‌ను సెంటిమెంటుగా భావించి అక్కడ షూటింగ్ చేస్తున్నట్లు  మీడియాలో వార్తలు వస్తున్నాయి. 

మీడియాలో ప్రచారమవుతున్న దాన్ని బట్టి తన కెరీర్లో అతి పెద్ద హిట్టుగా నిలిచిన ‘బాహుబలి’కొన్ని సీన్స్ ని   బల్గేరియాలో చిత్రీకరించాడు రాజమౌళి. బాహుబలి ‘ది బిగినింగ్’లో మంచు పర్వతాల నేపథ్యంలో వచ్చే సీన్స్ అక్కడ తీసినవే. ఇప్పుడు అదే చోట ‘ఆర్ఆర్ఆర్’ కోసం ఒక షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు సమాచారం. 

రకరకాల కారణాలతో  బ్రేక్ తీసుకుని  చేస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ కొత్త షెడ్యూల్ బల్గేరియాలోనే ప్రారంభం అవుతోంది. ‘బాహుబలి’ షూటింగ్ జరిగేటప్పుడే బల్గేరియాలో మరిన్ని చోట్ల తిరిగి తన తదుపరి సినిమాలకు అవసరమవుతాయేమో అని లొకేషన్స్ చూసి పెట్టుకున్నాడట రాజమౌళి. ఇప్పుడు‘ఆర్ఆర్ఆర్’లో ఓ కీలక ఎపిసోడ్ కోసం ఆ దేశాన్ని ఎంచుకోవటంతో చర్చనీయాంశంగా మారింది. కొత్త షెడ్యూల్లో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరు కూడా పాల్గొంటున్నట్లు సమాచారం.