ప్రమాదంలో మరణించిన అయ్యప్పనుమ్ కోశియుమ్ నటుడు
జోజు జార్జ్ హీరోగా తెరకెక్కుతున్న పీస్ మూవీ షూటింగ్ కోసం అనిల్ తోడుపూజ ప్రాంతానికి వెళ్లడం జరిగింది. అక్కడ గల మాలంకార డ్యామ్ సైట్ లో అనిల్ షూటింగ్ విరామంలో ఫ్రెండ్స్ తో స్నానానికి వెళ్లారు. నీటిలో స్నానం చేస్తుండగా అనిల్ ప్రమాదవశాత్తు ప్రవాహంలో కొట్టుకుపోయారు.
మలయాళ పరిశ్రమలో మరొక విషాదకర సంఘటన చోటు చేసుకుంది. మలయాళ నటుడు అనిల్ నెడుమన్గడ్ ప్రమాదంలో మరణించారు. 48ఏళ్ల అనిల్ నెడుమన్గడ్ అకాల మరణం చిత్ర పరిశ్రమను విషాదంలో నెట్టివేసింది. చిత్ర ప్రముఖులు అద్భుతమైన నటుడుని కోల్పోయామని దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. జోజు జార్జ్ హీరోగా తెరకెక్కుతున్న పీస్ మూవీ షూటింగ్ కోసం అనిల్ తోడుపూజ ప్రాంతానికి వెళ్లడం జరిగింది. అక్కడ గల మాలంకార డ్యామ్ సైట్ లో అనిల్ షూటింగ్ విరామంలో ఫ్రెండ్స్ తో స్నానానికి వెళ్లారు. నీటిలో స్నానం చేస్తుండగా అనిల్ ప్రమాదవశాత్తు ప్రవాహంలో కొట్టుకుపోయారు.
అనుకోకుండా జరిగిన ఈ ప్రమాదం షూటింగ్ సెట్స్ లో ఉన్న అందరినీ షాక్ కి గురిచేసింది. అనిల్ మరణానికి కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ విచారం వ్యక్తం చేశారు. వాళ్ళ కుటుంబానికి ఆయన సంతాపం ప్రకటించారు. పృథ్వి రాజ్, బిజూ మీనన్ మరియు దుల్కర్ సల్మాన్ అనిల్ అకాల మరణంపై సోషల్ మీడియా ద్వారా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ ఏడాది విడుదలైన అయ్యప్పనుమ్ కోశియుమ్ మూవీలో కథలో కీలకమైన సీఐ పాత్రను అనిల్ అద్బుతంగా చేశారు. ఈ చిత్ర దర్శకుడు సాచి గుండెపోటుతో మరణించగా... ఆ చిత్రంలో నటించిన అనిల్ నెలల వ్యవధిలో, ఇలా ప్రమాదవశాత్తు మరణించడం శోచనీయం. జాన్ స్టీవ్ లోపెజ్, పావడ, కమ్మట్టి పాదం, కిస్మత్ వంటి అనేక చిత్రాలలో అనిల్ కీలక పాత్రలు పోషించారు. బుల్లితెర నటుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన మంచి నటుడిగా ఎదిగారు.