తనకు ఉత్తమ నటిగా అవార్డ్ కావాలని అంటున్నారు బాలీవుడ్ యంగ్ హీరో ఆయుష్మాన్ ఖురానా. ఏ హీరో అయినా బెస్ట్ యాక్టర్ అవార్డు కోరుకుంటాడు కానీ ఆయుష్మాన్ ఏంటి ఉత్తమ నటి అవార్డ్ కోరుకుంటున్నాడని అనుకుంటున్నారా..? దానికి కారణం ఉందనే చెప్పాలి. ఆయుష్మాన్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం 'డ్రీమ్ గర్ల్'.

ఈ సినిమాలో ఆయుష్మాన్ పూజగా పేరు మార్చుకొని అమ్మాయి గొంతుతో మాట్లాడి వారిని వలలో  వేసుకుంటూ ఉంటాడు. దాంతో అందరూ ఆ వాయిస్ కి ఫ్లాట్ అయిపోయి పెళ్లంటూ చేసుకుంటే పూజనే చేసుకుంటామని పట్టుబడతారు.

ఆ తరువాత పూజా ఓ మగాడని తెలుస్తుంది. ఆ తరువాత ఏం జరిగిందనేదే సినిమా. ఈ లెక్కన చూసుకుంటే సినిమాలో ఆయుష్మాన్ హీరోతో పాటు హీరోయిన్ గా కూడా నటించినట్లే కదా.. ఆ కారణంగానే తనకు ఉత్తమ నటిగా అవార్డు కావాలని అంటున్నారు. ఇటీవల 'అందాదూన్' సినిమాకి ఎలాగో బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నాడు. సో.. 'డ్రీమ్ గర్ల్' సినిమాకి గాను ఉత్తమ నటిగా అవార్డ్ రావాలని కోరుకుంటున్నాడు.

అది సాధ్యం కాదు కాబట్టి కనీసం ఉత్తమ నటి కేటగిరీలో అయినా తన పేరు నామినేట్ అవ్వాలని ఆశపడుతున్నాడు. రాజ్ శాండిల్య దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో నుష్రత్ బరూచా హీరోయిన్ గా నటిస్తోంది. సెప్టెంబర్ 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.