Asianet News TeluguAsianet News Telugu

క్యాన్సర్ కు గురైన యువ హీరో భార్య!

విక్కీ డోనర్ సినిమాతో బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో ఆయుష్మాన్ ఖురానా ఇప్పుడు బాధలో ఉన్నాడు. ఎందుకంటే ఆయన సతీమణి ఒక చేదు వార్తతో బాలీవుడ్ కి షాకిచ్చింది. ఈ హీరో అభిమానులు ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేదు వార్తను చెప్పడం నేషనల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ayushman khurana wife shocking post
Author
Hyderabad, First Published Nov 29, 2018, 4:32 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

విక్కీ డోనర్ సినిమాతో బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో ఆయుష్మాన్ ఖురానా ఇప్పుడు బాధలో ఉన్నాడు. ఎందుకంటే ఆయన సతీమణి ఒక చేదు వార్తతో బాలీవుడ్ కి షాకిచ్చింది. ఈ హీరో అభిమానులు ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేదు వార్తను చెప్పడం నేషనల్ మీడియాలో వైరల్ గా మారింది. 

తాను క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు సోషల్ మీడియాలో ఆయుష్మాన్ సతీమణి తాహిరా వివరణ ఇచ్చింది. ప్రస్తుతం రొమ్ముకు సంబందించిన క్యాన్సర్ స్టేజ్ వన్ లో ఉన్నట్లు చెబుతూ.. తాను ఏ మాత్రం భయపడటం లేదని ఆ మహమ్మారి ఎంత ముదురినా పోరాడటానికి సిద్ధమని ఇన్స్టాగ్రామ్ లో వివరణ ఇచ్చారు. మొదట జీరో లెవెల్లో ఉన్నపుడే కేర్ తీసుకున్నప్పటికీ ఇప్పుడు అప్గ్రేడ్ వచ్చిందని కఠిన సమయమైన కూడా తట్టుకుంటున్నట్లు తెలిపారు. 

అయితే చాలా మంది ఇంతకంటే ఎక్కువ స్థాయిలో ఒడిదుడుకులను ఎదుర్కొని ఉంటారని తాను కూడా దైర్యంగా ఉన్నట్లు చెబుతూ.. తన శ్రేయేభిలాషులు ఎవరు ఆందోళన చెందవద్దని తాను మరింత జాగ్రత్తగా ఉండేందుకు ప్రయత్నం చేస్తాను అని తాహిరా తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios