Asianet News TeluguAsianet News Telugu

వైరల్ వీడియో: జిమ్ లో 95 కేజీలు బరువు ఎత్తిన హీరో తల్లి

ఈ వీడియో వచ్చాక టైగర్ తల్లి గురించి జనం మాట్లాడుకుంటున్నారు. ఆయేషా ఓ ఫిల్మ్ ప్రొడ్యూసర్, గతంలో మోడల్ కమ్ యాక్ట్రస్. అన్నిటికి మించి జాకీ ష్రాఫ్ ఇష్టపడి పెళ్లి చేసుకున్న అందగత్తె. ప్రస్తుతం బాలీవుడ్ లో దూసుకుపోతున్న యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ కు తల్లి. ఇన్ని క్వాలిఫికేషన్స్ తో పాటు ఇప్పుడు ఈ జిమ్ వీడియో..మరొక కిరీటం ఆమె తలపై తెచ్పిపెట్టింది. 
 

Ayesha Shroff deadlifting 95 kgs weight at the gym jsp
Author
Hyderabad, First Published Jan 25, 2021, 8:52 AM IST

సాధారణంగా హీరోలు ఫిట్ గా ఉంటూంటారు. ఈ మధ్యన హీరోయిన్స్ కూడా జిమ్ కు వెళ్లి చెమటలు కక్కుతున్నారు. అయితే హీరో తల్లి సైతం జిమ్ లో బరువులు ఎత్తుతుందంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. కానీ బాలీవుడ్ కండల వీరుడు టైగర్ ష్రాఫ్ తల్లి ఆయేషా ష్రాఫ్ మాత్రం ఇలాంటివన్నీ మామూలే అన్నట్లు జిమ్ లో 95 కేజీలు బరువు ఎత్తి షాక్ ఇచ్చింది. అది వీడియో తీసి ఆమె ఇనిస్ట్రా లో షేర్ చేసింది. ఇప్పుడా వీడియో వైరల్ అవుతోంది.

ఇక టైగర్ ష్రాఫ్.. అమేజింగ్ లుక్, ఎక్సలెంట్ ఫిజిక్, హంబుల్ యాక్టర్, మార్షల్ ఆర్టిస్ట్..లాంటి బిరుదులు ఉన్నాయి. కానీ ఈ వీడియో వచ్చాక టైగర్ తల్లి గురించి జనం మాట్లాడుకుంటున్నారు. ఆయేషా ఓ ఫిల్మ్ ప్రొడ్యూసర్, గతంలో మోడల్ కమ్ యాక్ట్రస్. అన్నిటికి మించి జాకీ ష్రాఫ్ ఇష్టపడి పెళ్లి చేసుకున్న అందగత్తె. ప్రస్తుతం బాలీవుడ్ లో దూసుకుపోతున్న యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ కు తల్లి. ఇన్ని క్వాలిఫికేషన్స్ తో పాటు ఇప్పుడు ఈ జిమ్ వీడియో..మరొక కిరీటం ఆమె తలపై తెచ్పిపెట్టింది. 
 
ఇక టైగర్ ష్రాఫ్ విషయానికి వస్తే... ‘వార్’ సినిమాతో హృతిక్, టైగర్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా సూపర్ హిట్ కాగా.. రెమో డిసౌజ డైరెక్షన్‌లో మరో సినిమా చేయబోతున్నారు టైగర్. వరుణ్ ధావన్ ప్లేస్‌లో టైగర్ సెలెక్ట్ కాగా.. సినిమా 2020 ఎండింగ్‌లో లేదా 2021 ప్రారంభంలో రిలీజ్ కానుంది. మరో వైపు అహ్మద్ ఖాన్ డైరెక్షన్‌లో వస్తున్న ‘హీరోపంతి 2’ సినిమాకు కూడా కమిట్ అయ్యాడు టైగర్. ఈ చిత్రానికి సాజిద్ నడియాడ్వాలా నిర్మాత కాగా… జూలై 2021లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios