అవినాష్‌ వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి ఎంటర్‌ అయ్యాడు. జోకర్‌గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టాడు. తాను జోకర్‌ని అని, తన జీవితంలోని అన్నీ కష్టాలే అని సినిమా కథలా చెప్పి అందరి హృదయాలను గెలుచుకున్నారు. చాలా వరకు నామినేషన్‌కి దూరంగా ఉంటూ వస్తున్నాయి. అందరితో బాగా ఉంటూ అలరిస్తున్నాడు. కానీ రెండు సార్లు ఎలిమినేషన్‌ వరకు వెళ్ళి తిరిగొచ్చాడు. 

పదమూడో వారంలో కూడా ఎలిమినేషన్‌తో పోరాడుతున్నాడు. ప్రస్తుతం అవినాష్‌, మోనాల్‌ ఎలిమినేషన్‌కి దగ్గరలో ఉన్నారు. ఈ వారం మోనాల్‌ ఎలిమినేట్‌ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇదే నిజమైతే అవినాష్‌ ఈ వారం బతికిపోయినట్టే అని చెప్పాలి. అలాగని వచ్చే వారం కూడా ఆయన్ని ఎలిమినేషన్‌ వెంటాడే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. 

అయితే బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌లో టాప్‌ ఫైవ్‌లోకి అఖిల్‌తోపాటు అభిజిత్‌, సోహైల్‌, అరియానా, హారిక వెళ్ళే ఛాన్స్ ఉందనే టాక్‌ వినిపిస్తుంది. ఇదే నిజమైతే వచ్చే వారం అవినాష్‌ ఎలిమినేట్‌ ఖాయమంటున్నారు. ఈ లెక్కన అవినాష్‌ నిజంగానే జోకర్‌గా మిగిలిపోతారని చెప్పొచ్చు. కమెడీయన్‌ చివరికి కూరలో కరివేపాకు మాదిరిగానే మిగిలిపోతాడా? ఏదైనా మిరాకిల్‌ సృష్టిస్తాడా? చూడాలి.