బిగ్ బాస్ హౌస్ లో రీయూనియన్ హంగామా షురూ అయ్యింది. హౌస్ నుండి ఎలిమినేటై బయటికి వెళ్లిన కంటెస్టెంట్స్ అందరూ ఒక్కొక్కరిగా రీఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే మోనాల్, లాస్య, స్వాతి దీక్షిత్ లతో పాటు కుమార్ సాయి బిగ్ బాస్ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కరు ఒక్కక్క తీరుగా రీఎంట్రీతో హౌస్ లో హంగామా చేస్తున్నారు. కాగా మిగతా కంటెస్టెంట్స్ నోయల్, గంగవ్వ, మెహబూబ్, దివి, సుజాత మరియు అవినాష్ కూడా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. 
 
సింగిల్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన అవినాష్ ఎప్పటిలాగే నవ్వులు పూయించారు. ఉన్నంత సేపు తన మార్కు కామెడీ పంచ్ లతో అలరించారు. అభిజిత్ ని దగ్గరకు పిలిచి, బయట ఫాలోయింగ్ మాములుగా లేదు, అందరూ ఫోన్ నంబర్స్ అడుగుతున్నారు అన్నాడు. కాకపోతే నీది కాదు నా నంబర్ అడుగుతున్నారు అంటూ పంచ్ వేశాడు. ఇక అఖిల్ ని పులిహోర రాజా అంటూ కామెడీ చేశాడు. మోనాల్ వచ్చిందా... పులిహోర బాగా కలిపావా... అంటూ సరదా పంచ్ లు వేశాడు. అందరితో కాసేపు సరదాగా గడిపిన అవినాష్ ని బయటికి వెళ్లాల్సిందిగా బిగ్ బాస్ ఆదేశించాడు. 
 
దానితో అవినాష్ వెళ్లనని మారాం చేశాడు. బయటికి పంపించేవాళ్ళు, లోపలికి ఎందుకు పిలిచారని బిగ్ బాస్ ని ప్రశ్నించాడు. అవినాష్ ఫ్రస్ట్రేషన్ ని ఇంటి సభ్యులు భలే ఎంజాయ్ చేశారు. ఉన్నంత సేపు అందరినీ నవ్వించిన అవినాష్ అందరికీ గుడ్ లక్ చెప్పి హౌస్ నుండి బయటికి వెళ్ళిపోయాడు. రేపే ఫైనల్ కావడంతో అందరిలో ఉత్కంఠ నెలకొని ఉంది. ఈ సీజన్ విన్నర్ ఎవరవుతారనే ఆసక్తి ఎక్కువైంది. అరియనా, సోహెల్, అఖిల్, అభిజిత్ మరియు హారిక ఫైనల్ కి చేరిన సంగతి తెలిసిందే.