అవినాష్ రంగ పాత్రలో ఈ టాస్క్‌లో పాన్ షాప్ ఓనర్‌గా కనిపించాడు. ఊరి పెద్ద అయిన సోహెల్ కూతురుగా అరియానా వెంకట లక్ష్మీ పాత్రలో కనిపించింది.  ఇక అవినాష్ అరియానాతో సరసాలు ఆడటంతో చూసి సోహెల్ ఫైర్ అయ్యాడు.

బుధవారం కెప్టెన్సీ టాస్క్ ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తుంది. పల్లెకు పోదాం ఛలో ఛలో.. అనే కార్యక్రమం పెట్టాడు బిగ్‌బాస్‌. ఈ కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా `పల్లెకు పోదాం ఛలో ఛాలో..` అంటూ `రంగస్థలం` అనే ఊరిగా మార్చేశాడు. ఆ ఊరి పెద్దగా సోహెల్, అతని భార్యగా లాస్య నటించింది. ఊరి పెద్ద భార్యను పడగొట్టేందుకు ప్రయత్నించే పాత్రలో అమ్మ రాజశేఖర్ కనిపించాడు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అవినాష్ రంగ పాత్రలో ఈ టాస్క్‌లో పాన్ షాప్ ఓనర్‌గా కనిపించాడు. ఊరి పెద్ద అయిన సోహెల్ కూతురుగా అరియానా వెంకట లక్ష్మీ పాత్రలో కనిపించింది. ఇక అవినాష్ అరియానాతో సరసాలు ఆడటం చూసి సోహెల్ ఫైర్ అయ్యాడు. తనకు మీ కూతురు కావాలని కన్నీళ్లు పెట్టుకున్నాడు అవినాష్‌. అందు కోసం సోహైల్‌ కాళ్ల మీద పడ్డాడు. అయినా చిరాకు పడుతూ ఊరిపెద్ద వెళ్లిపోయాడు. కానీ‌ అరియానా మాత్రం అవినాష్‌ కోసం ఎదురుచూడటం ఆసక్తిగా మారింది. మరోవైపు ఊర్లో పుకార్లు సృష్టిస్తూ, ఐటెమ్‌ గర్ల్ గా నటించిన హారిక తెగ ప్రేమిస్తున్నాడు రౌడీ మెహబూబ్‌. ఇలాంటి ఆసక్తికర సన్నివేశాలతో బిగ్‌బాస్‌ 59వ ఎపిసోడ్‌ సాగింది.