బిగ్‌బాస్‌ 4తో మరింత పాపులర్‌ అయ్యారు అవినాష్‌. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి హౌజ్‌ని తనదైన కామెడీతో రక్తికట్టించాడు. నాల్గో సీజన్‌లో బాగా అలరించిన నటుడిగా నిలవడంతోపాటు నాగార్జున చేత ప్రశంసలందుకున్నారు. హౌజ్‌లో అవినాష్‌కి, అరియానాకి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అయ్యింది. అయితే వీరి మధ్య ఇంకా ఏదో ఉందని, త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నారనే వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో దీనిపై ముక్కు అవినాష్‌ స్పందించారు. అరియానాతో పెళ్లి అనే వార్తల్లో నిజం లేదని, తను మంచి ఫ్రెండ్‌ అని తెలిపారు. 

ఇదిలా ఉంటే అవినాష్‌కి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే జీ తెలుగులో తాను జడ్జ్ గా పనిచేసే `బొమ్మ అదిరింది`లో అవినాష్‌కి ఓ ఆఫర్‌ ఇస్తానని నాగబాబు చెప్పారు. దాదాపు అది కన్ఫమ్‌ అని తెలుస్తుంది. మరోవైపు ఎంటర్‌టైనింగ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి కూడా మరో ఛాన్స్ ఇస్తానని చెప్పారట. తన తదుపరి సినిమాల్లో నటించే ఛాన్స్ ఇస్తానని చెప్పినట్టు అవినాష్‌ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 

అనిల్‌ రావిపూడి ప్రస్తుతం `ఎఫ్‌3` సినిమాని రూపొందిస్తున్నారు. వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌, తమన్నా, మెహరీన్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో బిగ్‌బాస్‌4 విన్నర్‌ అభిజిత్‌ కూడా ఓ ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి ఇందులో అవినాష్‌కి అవకాశం దక్కుతుందా? లేదా? అన్నది చూడాలి. ఇక అవినాష్‌ సొంతంగా ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ పెట్టుకుని అందులో వీడియోలు పోస్ట్ చేస్తూ బాగానే సంపాదిస్తున్నాడని టాక్‌.