బిగ్ బాస్ షో కొంత రసవత్తరంగా మారింది. నేరుగా ఫైనల్ కి వెళ్లే అవకాశం కోసం ఇంటి సభ్యులు చెమటోడ్చుతున్నాడు. నేరుగా ఫైనల్ కి చేరే మెడల్ కోసం బిగ్ బాస్ నిర్వహించిన మొదటి టాస్క్ పాలు సేకరించడంలో అభిజిత్, హారిక, అఖిల్ మరియు సోహైల్ గెలిచి నెక్స్ట్ లెవెల్ కి వెళ్లారు. ఐతే ఈ టాస్క్ లో ఓడిపోయిన అవినాష్ మరియు అరియానా ఆవేదనకు గురయ్యారు. దానికి కారణం అఖిల్ మరియు సోహైల్ టీమ్ గా ఆడారు. వాళ్లిద్దరూ గెలుపు కోసం ఒకరికి మరొకరు సహాయం చేసుకున్నారు. అందరికంటే ఎక్కువ పాలు సేకరించి నెక్స్ట్ లెవెల్ కి వెళ్లారు. దీనిని అభిజిత్ ప్రశ్నించారు. ముఖ్యంగా అవినాష్ దీని తీవ్రంగా వ్యతిరేకించారు. గెలుపు కోసం ఏదైనా చేయొచ్చని అఖిల్, అభిజిత్ సమర్ధించుకున్నారు. 

టికెట్ టు ఫినాలే కోసం నేడు జరిగిన రెండవ దశ టాస్క్ లో ఎక్కువ పూలు సేకరించాలని చెప్పాడు. ఈ గేమ్ విషయంలో హారిక, సోహైల్ మధ్య గట్టిగా గొడవ జరిగింది. ఈ గేమ్ ని ఇండివిడ్యువల్ గా ఆడాలని బిగ్ బాస్ ఆదేశించారు. ఐతే నిన్న పాలు సేకరించే గేమ్ లో అఖిల్, సోహైల్ కలిసి ఆడారని అప్పుడు బిగ్ బాస్ మాట్లాడలేదని అవినాష్ మరియు అరియానా ఆవేదన చెందారు. 

బయట బిగ్ బాస్ స్క్రిప్టెడ్ అనుకుంటున్నారు. అది నిజం కాదు ఇక్కడ గేమ్ లో గెలవడానికి చాలా కష్టపడాలి అని అవినాష్ అన్నారు. ఓడిపోతానని తెలిసినా చివరి వరకు పోరాడాను, గేమ్ మీద ఇష్టంతో అని అరియనా అన్నది. మొత్తంగా అన్ ఫెయిర్ గేమ్ ఆడిన అఖిల్, సోహైల్ ని ఎందుకు ప్రోత్సహించారని బిగ్ బాస్ ని ప్రశ్నించారు అవినాష్ మరియు అరియానా.