చాలా సార్లు తెలుగులో రిలీజ్ అయిన పెద్ద హీరోల సినిమాలు కలెక్షన్స్ డ్రాప్ అవుతుందనుకున్నప్పుడు కొత్త ఫుటేజ్ కలిసి వదులుతూంటారు. అది పాట కావచ్చు, కామెడీ సీన్స్ కావచ్చు, లేదా ఫైట్స్ కావచ్చు. ఏదైనా ఎడిటింగ్ లో తొలిగించిన వాటిని మళ్లీ కలుపుతూంటారు. దాంతో ఆల్రెడీ సినిమా చూసిన వాళ్లు సైతం మళ్లీ చూడటానికి వెళ్తూంటారు.  ఈ స్ట్రాటజీ చాలా సార్లు వర్కవుట్ అయ్యింది. ఇప్పుడు ఇలాంటి స్ట్రాటజీనే ఎవేంజర్స్ ది ఎండ్ గేమ్ నిర్మాతలు ప్లే చెయ్యబోతున్నారు. 

మార్వెల్ సంస్థ నుంచి వచ్చిన  ఎవెంజర్స్  ది ఎండ్ గేమ్ సినిమా  ప్రపంచవ్యాప్తంగా భారీ గా కలెక్ట్ చేసిన సంగతి తెలిసిందే.   ఇండియాలో కూడా ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్  అయ్యింది.  ఎవెంజర్స్ కు ఇంతటి డిమాండ్ రావడానికి కారణం... గతంలో ఎవెంజర్స్ సీరీస్ లో మూడు సినిమాలు మూడు మంచి విజయాన్ని సొంతం చేసుకోవటమే.  ముఖ్యంగా మూడో సినిమా ఎవెంజర్స్ ఇన్ఫినిటీ వార్.  

దీంతో నాలుగో సీరీస్ పై అంచనాలు పెరిగాయి.  పైగా ఈ సిరీస్ లో చివరి సినిమా ఇదే అని మార్వెల్ సంస్థ ప్రకటించడంతో డిమాండ్ మరింత ఊపందుకుంది.  దాంతో  ఈ సినిమా ఇప్పటి వరకున్న ప్రపంచ రికార్డులన్నింటిని బద్దలుకొట్టింది.  అయితే మార్వెల్ సంస్ద అక్కడితో ఊరుకునేలా లేదు. ఈ సినిమా నుంచి మరింత పిండుకోవలాని ప్రయత్నం చేస్తోంది.

ఈ నేపధ్యంలో ‘ది ఎండ్ గేమ్’ రీరిలీజ్‌కు రెడీ అవుతోంది. ఒరిజినల్ కట్ నుంచి తీసి  ఎడిటింగ్ సమయంలో పక్కన పెట్టేసిన అదనపు ఫుటేజ్‌తో కొత్త వెర్షన్ రిలీజ్ చేస్తోంది. ఆల్రెడీ ‘ది ఎండ్ గేమ్’ చూసిన వాళ్లు ఎక్స్‌ట్రా ఫుటేజ్ చూడటానికి మళ్లీ థియేటర్లకు రప్పించవచ్చు అని ఈ స్కెచ్ వేస్తోంది. దాంతో అవతార్ రికార్డ్ ని అన్ని విధాలుగా పడగొట్టచ్చని భావిస్తోంది. అంతేకాదు..ఈ కొత్త వెర్షన్ తో ... కొత్త ప్రేక్షకులనూ ఆకర్షించవచ్చు.