గ్రాఫిక్స్ తో సరికొత్త ప్రపంచాన్ని ప్రతి మనిషి హృదయంలో బలంగా నాటేసిన దర్శకుడు జేమ్స్ కామెరూన్. టైటానిక్ సినిమానే ఒక అద్భుతం అనుకుంటే దాన్ని మించిన స్థాయిలో టెక్నాలిజీని అప్గ్రేడ్ చేసి మరి అవతార్ ని తెరకెక్కించాడు.  ఆ సినిమా ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లను అందుకున్న చిత్రంగా నిలిచిన సంగతి తెలిసిందే. 

అయితే ఆ సక్సెస్ కథకు సీక్వెల్స్ అవతార్ 2, 3లు అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్నాయి. పండోరా గ్రహాన్ని మరింత అద్భుతంగా చూపించనున్నట్లు చిత్ర యూనిట్ ఇదివరకే క్లారిటీ ఇచ్చింది. ఇక కథకు సంబందించిన కొన్ని విషయాలు హాలీవుడ్ మీడియాలో వైరల్ అవవుతున్నాయి.

అవతార్ లో కథానాయకుడు జేక్ - గిరిజన యువతి మధ్య ప్రేమను అద్భుతంగా చూపించిన దర్శకుడు అవతార్ 2లో ఆ పాత్రల వివాహాన్ని చూపిస్తాడట. అదే విధంగా అత్యంత టెక్నాలిజీతో భారీ యాక్షన్ సన్నివేశాలను గ్రాఫిక్స్ మాయాజాలంతో సరికొత్తగా ప్రజెంట్ చేయనున్నట్లు తెలుస్తోంది. 

ఇక సముద్ర గర్భంలో జరిగే యుద్ధ సన్నివేశాలు కూడా ఉంటాయట. అండర్ వాటర్ లో సరికొత్త ప్రపంచాన్ని సృష్టించారట. కొన్ని నిమిషాల పాటు ఆ సీన్స్ కనురెప్పను కూడా కదిలించవట. ఆ స్థాయిలో గ్రాఫిక్స్ ఉంటాయని సమాచారం. ఇక అవతార్ 2 2020 డిసెంబర్ 18న రిలీజ్ కానుంది. పార్ట్ 3 ఏడాది వ్యవవధిలో  2021 డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.