శ్రీ మహాలక్ష్మి ఎంటర్ ప్రైజేస్ బ్యానర్  పై  జొన్నలగడ్డ శ్రీనివాస్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా "ఆటో రజని" ప్రేమెంత పనిచేసే నారాయణ సినిమాలో తన  డాన్స్ లతో ,యాక్టింగ్ తో మంచి పేరు తెచ్చుకున్న జొన్నలగడ్డ హరికృష్ణ హీరోగా తెరకెక్కుతున్న పవర్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్ `ఆటో రజని`.

జొన్నలగడ్డ హరిక్రిష్ణ రెండవ సినిమా గా వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఆంద్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కొడాలి నాని ఆవిష్కరించి చిత్ర దర్శక నిర్మాతలకు హీరో హీరోయిన్లకు శుభాకాంక్షలు తెలియ చేసారు.

ఈ సందర్భంగా దర్శకులు జొన్నలగడ్డ శ్రీనివాస్ మాట్లాడుతూ... `ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు అందుకున్న మొదటి సినిమాగా మా `ఆటో రజని` ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యింది. ఈరోజు కొడాలి నాని గారు మా ఆటో రజినీ సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. వారికి మా ధన్యవాదములు` అన్నారు.

చిత్ర హీరో హరికృష్ణ జొన్నలగడ్డ మాట్లాడుతూ.. `నా రెండవ సినిమా ఎపిసిఎం వైఎస్ జగన్ గారి ఆశీస్సులతో ప్రారంభమైంది. ఈరోజు మినిస్టర్ కొడాలినాని గారు ఫస్ట్ లుక్ పోస్టర్ ను అవిషరించారు.టైటిల్ కి తగ్గట్టు అన్ని కమర్షియల్ అంశాలతో సినిమా వుంటుంది.త్వరలోనే ఈ సినిమా  పూర్తి వివరాలు  తెలియ జేస్తామ`న్నారు.