రిలీజ్ అయ్యి ఏడాది కావస్తున్నా.. పుష్ప మ్యానియా ఏమాత్రం తగ్గలేదు. టాలీవుడ్ లోనే కాదు..నేషనల్ లెవల్లో... ఇంటర్నేషనల్ లెవల్లో పుష్పకు తిరుగులేని క్రేజ్ వచ్చింది. ఇక రీసెంట్ గా ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ పుష్ప కోసం ఏం చేశారంటే..?

రీసెంట్ గా ఫిలిం ఫేర్‌ లో అవార్డ్ ల పంట పండించింది పుష్ప సినిమా. ఫిల్మ్ ఫేర్ పురస్కారాల్లో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తో పాటు టీమ్ అంతా దుమ్ము రేపింది. పుష్ప సినిమాకు ఏకంగా ఏడు పురస్కారాలు దక్కడంతో.. ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీలో ఉన్నారు. అల్లు అర్జున్‌, పుష్ప టీమ్‌కు అభినందనల వెల్లువెత్తాయి. ఇక ఈక్రమంలోనే ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ పుష్ప టీమ్‌కు డిఫరెంట్ గా అభినందనలు తెలిపారు.

ఫిలింఫేర్ అవార్డులకు అల్లు అర్జున్‌ పుష్ప ఎంపికవ్వడం సంతోషం. అల్లు అర్జున్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ సినిమాలో నటించిన వారందరికీ అభినందనలు అని పోస్ట్‌ చేశారు. దీంతో పాటు పుష్ప గెటప్‌లో ఉన్న తన ఫోటోను షేర్‌ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. పుష్పరాజ్ గెటప్ లో డేవిడ్ వార్నర్ అద్భుతంగా ఉన్నాడు. ఆయన ఆహార్యం అచ్చం బన్నీని పోలినట్టే ఉంది. ఇక ఇంతకు ముందు కూడా పుష్ప సాంగ్స్ ను రీమిక్స్ చేశాడు వార్నర్. ఈ సినిమాతో పాటు టాలీవుడ్ ఫేమస్ హీరోల సినిమాలు రిలీజ్ అవ్వగానే వాటిని ఫ్యామిలీతో సహా రీమిక్స్ చేయడం ఆయకు అలవాటు. 

Scroll to load tweet…

ఇక ఫిలిం ఫేర్ అవార్డుల్లో పుష్ప ది రైజ్‌ ఏడు అవార్డులతో సత్తా చాటుకుంది. ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌, ఉత్తమ దర్శకుడిగా సుకుమార్‌, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్‌, ఉత్తమ మేల్‌ సింగర్‌, ఫీమేల్‌ సింగర్‌, అవార్డ్ లతో పాటు సినిమాటోగ్రఫీ విభాగాల్లో అవార్డ్స్‌ వచ్చాయి. బెంగ‌ళూరులో జ‌రిగిన ఈవెంట్‌లో పుష్ప సినిమాకు ఉత్తమ న‌టుడిగా అవార్డు అందుకున్నాడు బ‌న్నీ. ఈ సంద‌ర్భంగా ప్రతి ఒక్కరికీ ఆయన ధ‌న్యవాదాలు తెలిపాడు. 

ఇక పుష్ప రిలీజ్ తరువాత ఈ సినిమా నుంచి ప్రతీ మూమెంట్ వైరల్ అవుతుూనే ఉంది. పుష్ప యాటీడ్యూడ్ తో పాటుగా.. ఆయన మ్యానరిజం, నడకా, స్టైల్ ను ఫాలో అవుతూ.. ఈ సినిమాలో పాటలను ఇమిటేట్ చేస్తూ.. వేలల్లో వీడియోలు సోషల్ మీడియాలో దర్శనం ఇస్తున్నాయి. అంతే కాదు ఈసినిమాతో ఫస్ట్ టైమ్ పాన్ ఇండియాకు వెళ్లిన బన్నీకి..అక్కడ తిరుగులేని క్రేజ్ ఏర్పడింది. బన్నీ ఎప్పుడు కనిపిస్తాడా అని ఎదురు చూస్తున్నారు నార్త్ ఫ్యాన్స్. ఈ మధ్య అమృత్ సర్ వెళ్తే.. సాధరంగా ఆహ్వనించారు అక్కడ టీమ్. 

ఇలా పుష్ప సినిమాతో ఆయనకు తిరుగులేని క్రేజ్ ఏర్పడింది. ఫస్ట్ పార్ట్ చూసిన జనాలు.. ఇక సెకండ్ పార్ట్ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక పుష్ప 2 మూవీ షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. ఈ సినిమాకోసం అన్నీ రెడీ చేసుకున్నారు టీమ్. అంతే కాదు. ఎక్కడా పొరపాటు చేయకుండా.. పుష్ప క్రేజ్ ను పుష్ప2 డామేజ్ చేయకుండా జాగ్రత్త పడబోతున్నారు. స్పీడ్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకుని నెక్ట్స్ ఇయర్ సమ్మర్ కు రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నారట. మరి చూడాలి ఈ మూవీ ఎంత వరకూ అంచనాలు నిలబెడుతుందో.