Asianet News TeluguAsianet News Telugu

ఇకపై షో చూడం.. బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌పై ప్రేక్షకుల నుంచి తీవ్ర విమర్శలు

ఆదివారం జరిగిన గ్రాండ్‌ ఫినాలెలో మాత్రం సోహైల్‌ 25లక్షలు తీసుకునేందుకు ఒప్పుకున్నాక ఆ విషయాన్ని నాగార్జున రివీల్‌ చేశారు. అలాంటప్పుడు విన్నర్‌ కి దక్కిన గౌరవమేంటి? ఓన్లీ ట్రోఫీ కోసం విన్నర్‌ కావాలా? అనే చర్చ మొదలైంది. ఇదే ఇప్పుడు సోషల్‌ మీడియాలో దుమారం రేపుతుంది. 

audiance critisize on biggboss4  arj
Author
Hyderabad, First Published Dec 21, 2020, 2:11 PM IST

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ గ్రాండ్‌ ఫినాలె పూర్తయ్యింది. ముందు నుంచి అనుకున్నట్టుగానే అభిజిత్‌ ట్రోఫీ గెలుచుకున్నారు. ఇందులో పెద్ద సర్‌ప్రైజ్‌ ఏమీ లేదు. అంతా ఊహించినట్టే జరిగింది. మొదటి నుంచి అఖిల్‌ తాను టాప్‌ 2లో ఉంటానని చెప్పుకుంటూ వచ్చాడు. చివరికి అదే జరిగింది. దీంతో ముందుగానే ఎవరో విన్నర్‌, ఎవరి సెకండ్‌, ఎవర్‌ థర్డ్ అనే విషయం తెలిసిపోయింది. 

ఇదే ఇప్పుడు అనేక విమర్శలకు తావిస్తుంది. అంతా భావించిన అభిజిత్‌ విన్నర్‌ అవ్వడంపై ఓ చర్చ జరుగుతుంటే, ఆయన ట్రోఫీ గెలుచుకున్నా, మొత్తం ప్రైజ్‌మనీని పొందకపోవడం మరింత ఆగ్రహానికి కారణమైంది. బిగ్‌బాస్‌ టైటిల్‌ విన్నర్‌కి యాభై లక్షల ప్రైజ్‌మనీ ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ఆదివారం జరిగిన గ్రాండ్‌ ఫినాలెలో మాత్రం సోహైల్‌ 25లక్షలు తీసుకునేందుకు ఒప్పుకున్నాక ఆ విషయాన్ని నాగార్జున రివీల్‌ చేశారు. అలాంటప్పుడు విన్నర్‌ కి దక్కిన గౌరవమేంటి? ఓన్లీ ట్రోఫీ కోసం విన్నర్‌ కావాలా? అనే చర్చ మొదలైంది. ఇదే ఇప్పుడు సోషల్‌ మీడియాలో దుమారం రేపుతుంది. అంతేకాదు ఇకపై బిగ్‌బాస్‌ షోని చూడమంటున్నారు. 

అభిజిత్‌ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సోషల్‌ మీడియాలో బిగ్‌బాస్‌ నిర్వహకులపై తీవ్రంగా ఫైర్‌ అవుతున్నారు. మీరు ఇలా చేయాల్సినప్పుడు మేం ఓట్లు వేసి ప్రయోజనమేంటి? ప్రైజ్‌మనీ నుంచి రూ.25లక్షలు కట్‌ చేయడమేంటి? ఇంత కక్కుర్తిగా ఆలోచిస్తారా ? అంటూ ట్రోల్‌ చేస్తున్నారు. 106 రోజులపాటు షో నిర్వహించి ప్రకటనల రూపంలో కోట్లు గడించి చివరికి రూ.25లక్షల విషయంలో ఇంత ఛీప్‌గా ఆలోచిస్తారా? అంటూ కామెంట్‌ చేస్తున్నారు. 

ఈ విషయంలో హోస్ట్ నాగార్జునపై కూడా విమర్శలు వస్తున్నాయి. ఆయన మొదటి నుంచి కొంత మందికి సానుకూలంగా ఉన్నారని, పక్షపాతంగా వ్యవహరించారని అంటున్నారు. బాగా ఆడిన అఖిల్‌కి విన్నర్‌గా కాకుండా, మొదటి నుంచి పెద్దగా యాక్టీవ్‌గా లేని అభిజిత్‌ని విన్నర్‌ చేయడమేంటనే విమర్శలు వస్తున్నాయి. ఎంతో చురుకుగా ఉన్నా సోహైల్‌ని సైతం ముందుగానే తప్పుకునేలా చేశారని అంటున్నారు. బిగ్‌బాస్‌ పక్కా ప్రణాళిక ప్రకారమే ఇలా చేశారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. 

మహిళలకు ఈ సారి కూడా మొండిచేయి ఎదురైంది. చాలా మంది ప్రముఖులు బిగ్‌బాస్‌ ట్రోఫీ మహిళలు గెలుచుకుంటే చూడాలని, ఎప్పుడూ మగవారినే విన్నర్‌ని చేస్తున్నారని, ఆడవారు విన్నర్‌గా నిలవడం లేదనే అభిప్రాయపడ్డారు. ఈ సారి మహిళలకు దక్కితే బాగుండు అన్నారు. నిజానికి ఇందులో హారిక, అరియానా చాలా బాగా ఆడారు. మగవారిని దీటుగా ఎదుర్కొని నిలబడ్డారు. సూపర్‌ 5లోకి వచ్చారు. ఈ స్థాయికి చేరుకున్నారంటే అది మామూలు విషయం కాదు. కానీ చివరికి వారిని ముందుగానే ఎలిమినేట్‌ చేయడం విమర్శలకు తావిస్తుంది. కనీసం టాప్‌ 3లోనైనా, రన్నరప్‌గానైనా వారికి ఇస్తే బాగుండేదంటున్నారు. మరి దీనిపై బిగ్‌ బాస్‌ నిర్వహకులు స్పందిస్తారా? లేక కేవలం విమర్శలకే పరిమితమవుతుందా? అనేది చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios