అట్లీ, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ ఫిక్స్..నిర్మాత మాత్రం బిగ్ సర్ప్రైజ్, ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఇవిగో
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జనసేనానిగా జనసేన పార్టీని ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. పాలిటిక్స్ వల్ల పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల షూటింగ్స్ తాత్కాలికంగా ఆగిపోయాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జనసేనానిగా జనసేన పార్టీని ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. పాలిటిక్స్ వల్ల పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల షూటింగ్స్ తాత్కాలికంగా ఆగిపోయాయి. హరిహర వీరమల్లు, ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి చిత్రాలలో పవన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఎన్నికలు పూర్తయిన తర్వాతే పవన్ కళ్యాణ్ ఈ చిత్రాల కోసం సమయం కేటాయించనున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ లిస్ట్ లో మరో చిత్రం చేరినట్లు వార్తలు వస్తున్నాయి. ఆల్మోస్ట్ ఈ కాంబినేషన్ ఫిక్స్ అయినట్లు కూడా తెలుస్తోంది.
జవాన్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కొట్టిన అట్లీ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించబోతున్నట్లు సమాచారం అందుతోంది. ఆల్రెడీ ఈ కాంబినేషన్ ఫిక్స్ అయినట్లు జోరుగా వార్తలు వస్తున్నాయి. బిగ్ సర్ప్రైజ్ ఏంటంటే ఈ చిత్రానికి మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్మాతగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
అట్లీ త్వరలో అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఈ లోపు పవన్ తాను పూర్తి చేయాల్సిన చిత్రాల్లో నటిస్తాడు. బన్నీ మూవీ పూర్తయ్యాక పవన్, అట్లీ కాంబోలో చిత్రం పట్టాలెక్కబోతోందని అంటున్నారు. త్రివిక్రమ్ తో పాటు మరో నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ ఎన్నికల తర్వాత ముందుగా ఓజిని పూర్తి చేస్తారు. ఆ తర్వాత హరిహర వీరమల్లు, ఉస్తాద్ చిత్రాల్లో ఒకేసారి నటిస్తారు.
కమర్షియల్ చిత్రాలకు మంచి సందేశం జోడించి చిత్రం తెరకెక్కించడం అట్లీ స్టైల్. జవాన్ చిత్రంలో షారుఖ్ ని డ్యూయెల్ రోల్ లో ప్రజెంట్ చేసిన అట్లీ సూపర్ హిట్ అందుకున్నారు. ఏది ఏమైనా పవన్, అట్లీ చిత్రం పట్టాలెక్కితే మాత్రం ఫ్యాన్స్ కి పండగే అని చెప్పాలి.