పెళ్లి బాజా మోగిస్తానంటోన్న అధర్వ.. డేట్స్ ఫిక్స్.. అమ్మాయి ఎవరంటే?
అధర్వత్వరలో బ్యాచ్‌లర్ లైఫ్‌కి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాడట. గోవాకి చెందిన అమ్మాయితో అధర్వ ప్రేమలో ఉన్నారని, తమ లవ్ స్టోరీ ఇరు కుటుంబ సభ్యులకు చెప్పగా, వారు అంగీకారం చెప్పినట్టు సమాచారం.
కోలీవుడ్‌లో పెళ్లి సందడి షురూ అవుతుంది. టాలీవుడ్ హీరోల మాదిరిగా తమిళనాట కూడా సెలబ్రిటీలు మ్యారేజ్ చేసుకుని సెటిల్ అవ్వాలని నిర్ణయించుకుంటున్నారు. స్టార్ హీరోయిన్ త్రిష, ఆమె ప్రియుడు శింబు మ్యారేజ్ చేసుకోబోతుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ నేపథ్యంలో అధర్వ పేరు తెరపైకి వచ్చింది. త్వరలో ఆయన బ్యాచ్‌లర్ లైఫ్‌కి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాడట. గోవాకి చెందిన అమ్మాయితో అధర్వ ప్రేమలో ఉన్నారని, తమ లవ్ స్టోరీ ఇరు కుటుంబ సభ్యులకు చెప్పగా, వారు అంగీకారం చెప్పినట్టు సమాచారం. అన్ని అనుకున్నట్టు జరిగితే జనవరిలో వీరి పెళ్లిపీఠలెక్కబోతున్నారని సమాచారం. మరి ఇది ఎలాంటి టర్న్ లు తీసుకుంటుందో చూడాలి.
అధర్వ గతేడాది `గద్దలకొండ గణేష్` సినిమాతో తెలుగు ఆడియెన్స్ కి పరిచయం అయ్యారు. అందులో సినిమా డైరెక్టర్‌గా నటించి ఆకట్టుకున్నారు. దీంతోపాటు `అంజలి సిబిఐ` అనే డబ్బింగ్ చిత్రం ద్వారానూ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమయ్యారు. అన్నట్టు అధర్వ నటుడు మురళీ తనయుడు కావడం విశేషం.
2010లో నటుడిగా కెరీర్ ప్రారంభించిన అధర్వ అడపాదడపా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. గతేడాది నుంచి ఆయన కెరీర్ కాస్త ఊపందుకుంది. తమిళంలో `100`, `బూమేరాంగ్`, తెలుగులో `గద్దల కొండ గణేష్`తో విజయాలను అందుకున్నారు. ఇప్పుడు `తల్లి పొగతే`, `కురుతి అట్టమ్`, `ఒతైక్కు ఓతై`, `రుక్కుమణి వాండి వరుధు` చిత్రాల్లో నటిస్తున్నారు.