పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన రెండవ చిత్రం అత్తారింటికి దారేది. టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గట్లుగా త్రివిక్రమ్ మంచి ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 

అత్తారింటికి దారేది సాధించిన ఘనవిజయంతో ఈ చిత్రాన్ని తమిళంలో స్టార్ హీరో శింబు 'వందా రాజవదాన్ వరువేన్' పేరుతో రీమేక్ చేశాడు. సుందర్ సి ఈ చిత్రానికి దర్శకుడు. మేఘా ఆకాష్, కేథరిన్ ఈ చిత్రంలో కథానాయికలు గా నటించడం విశేషం. తెలుగులో నదియా పోషించిన పాత్రని తమిళంలో రమ్యకృష్ణ చేసింది. 

ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. తమిళ ప్రేక్షకులకు ఈ కథ ఏ మాత్రం కనెక్ట్ కాలేదు. ఫలితంగా చిత్ర నిర్మాతలకు తీవ్ర నష్టాలు మిగిలాయి. తాజాగా ఈ చిత్రానిని నిర్మాతలకు దాదాపు 14 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. భారీ చిత్రాల నిర్మాణ సంస్థ లైకా ఈ చిత్రాన్ని నిర్మించింది. 

ఈ విషయంలో నిర్మాణ సంస్థ శింబుని నిందించింది. శింబు షూటింగ్ లకు ఆలస్యంగా వస్తాడని.. సినిమా పరాజయంతో పాటు అతడి వైఖరి నిర్మాతలకు అదనపు భారం అని పేర్కొంది.