Atal: వాజ్‌పేయి బయోపిక్ లో విలక్షణ నటుడు.. వైరల్‌ న్యూస్‌

మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి జీవితం ఆధారంగా సినిమా రాబోతుంది. `అటల్‌` పేరుతో ఈ బయోపిక్‌ని రూపొందించబోతున్నారు. 

atal bihari vajpayee biopic versatile actor play lead role

బయోపిక్‌ చిత్రాలకు మంచి ఆదరణ దక్కుతుంది. రియలిస్టిక్‌ చిత్రాలు మంచి విజయాలు సాధిస్తున్న నేపథ్యంలో జీవిత కథలు ఇప్పుడు సెలబుల్‌ స్టోరీస్‌గా నిలుస్తున్నాయి. ఇటీవల ముంబయి దాడుల్లో వీరమరణం పొందిన మేజర్‌ సందీప్‌ ఉన్నిక్రిష్ణన్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిన `మేజర్‌` చిత్రం విడుదలై బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. దీంతో ఇప్పుడు మరో బయోపిక్‌ తెరపైకి రాబోతుంది. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి జీవితాన్ని తెరపైకి ఎక్కించబోతున్నారు.

దివంగత బీజేపీ నాయకుడు, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి జీవితం ఆధారంగా `అటల్‌` అనే సినిమాని రూపొందించబోతున్నారు. `మై రహూ యా నా రహూ ఏ దేశ్‌ రెహనా చాహియే- అటల్‌` అనేది సినిమా పూర్తి టైటిల్‌. ఈ బయోపిక్‌ని కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు. ఉల్లేక్‌ ఎన్‌పీ రాసిన `ది అన్‌టోల్డ్ వాజ్‌పేయిః పొలిటీషియన్‌ అండ్‌ పారాడాక్స్` అనే పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వినోద్‌ భన్సాలీ, సందీప్‌ సింగ్‌ నిర్మాతలు. దర్శకత్వం ఎవరు వహిస్తారనేది క్లారిటీ లేదు. 

ఈ సినిమాకి సంబంధించి మరో కొత్త అప్‌డేట్‌ వినిపిస్తుంది. ఇందులో వాజ్‌పేయి పాత్రలో బాలీవుడ్‌ విలక్షణ నటుడు పంకజ్‌ త్రిపాటి నటించబోతున్నట్టు తెలుస్తుంది. పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేయడంలో పంకజ్‌ ముందుంటారు. క్యారేక్టర్‌ ఆర్టిస్ట్ గా, విలన్‌గా అనేక సినిమాలు చేశారు. ఆయన మాజీ ప్రధాని పాత్రలో కనిపించబోతున్నారనే వార్త బాలీవుడ్‌లో వైరల్‌ అవుతుంది. అదే సమయంలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. వాజాపేయి పాత్రకి బాగా సూట్‌ అవుతారని, సరైన న్యాయం చేస్తారని అంటున్నారు. మరి ఆయన నటిస్తున్నారనే వార్తల్లోనిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది(2023) డిసెంబర్‌ 25న విడుదల చేయబోతున్నారు. 

వాజ్‌పేయి ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకుడిగా ఎదిగారు. ఆ తర్వాత బీజేపీ ఫౌండర్‌ ప్రెసిడెంట్‌గా సేవలందించారు. ఆ తర్వాత ఎంపీగా ఎంపికయ్యారు. 1968 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఏడుసార్లు ఎంపీగా, రెండేళ్లు మంత్రిగా సేవలందించారు.  1996 నుంచి 2004 వరకు భారత ప్రధానిగా సేవలందించారు. దాదాపు ఎనిమిదేళ్లు ప్రధానిగా పనిచేశారు. నాలుగేళ్ల క్రితం ఆయన కన్నుమూసిన విషయం తెలిసిందే.  ఆయన్ని భారత ప్రభుత్వం `భారతరత్న`తో గౌరవించింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios