సూపర్ స్టార్ రజనీకాంత్’ఈ పేరు చెప్తే చాలా మంది పులకించి పోతారు. అభిమానులు ఆయన సినిమాల అప్ డేట్స్ కోసం నిరంతరం ఎదురుచూస్తూనే ఉంటారు.  అంతేకాదు ఏ చిన్న వీడియో వచ్చినా పులకించిపోతూంటారు. దాన్ని వైరల్ చేసేస్తూంటారు. ఇప్పుడు అదే పరిస్దితి. రజనీ రీసెంట్ తన ఫ్యామిలీ ఫంక్షన్ లో చేసిన డాన్స్ ని సోషల్ మీడియాలో వైరల్ చేసే పనిలో పడ్డారు ఫ్యాన్స్. 

వివరాల్లోకి వెళ్తే.. రజనీకాంత్ కుమార్తె సౌందర్య, నటుడు విశాగన్  ఈ రోజు జరగనుంది. ఈ నేపధ్యంలో  వివాహ సంగీత్ కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఆ పోగ్రామ్ లో రజనీకాంత్ హుషారుగా స్టెప్పులేశారు. ఆయన పాత చిత్రాల్లోని తన డాన్స్ మూమెంట్స్ గుర్తు చేస్తూ దుమ్ము రేపారు. మరీ ముఖ్యంగా ‘ముత్తు’ సినిమా పాటలకు ఆయన వేసిన స్టెప్పులు చూసి అంతా ఫిదా అయ్యిపోయారు. దాంతో కొందరు ఆ వీడియో తీసి ...ట్వీట్ చేసారు. అది వైరల్ అయ్యిపోయింది. 

ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ రెండవ కుమార్తె సౌందర్య రజనీకాంత్ వివాహం నటుడు విశాగన్ తో ఈ నెల 11న జరగనుంది.  చెన్నై నగరంలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్లో ఈ వేడుక జరగనుంది.  కార్యక్రమాన్ని భారీ స్థాయిలో కాకుండా సింపుల్ గా ముగించాలని రజనీ డిసైడయ్యారట.  

అందుకే అత్యంట సన్నిహితులైన కొందరు సినీ, రాజకీయా ప్రముఖులకు మాత్రమే ఆయన ఆహ్వానాలు పంపారు.  వారిలో సినీ నటులు కమల్ హాసన్, ప్రభు, తమిళనాడు కాంగ్రెస్ స్తట్ట్ ప్రెసిడెంట్ తిరునవక్కరసర్, తిరుమవళవన్ వంటి పొలిటికల్ లీడర్స్ ఉన్నారు. 

సౌందర్య, విశాగన్‌.. ఇద్దరికీ ఇది రెండో వివాహం. గతంలో పారిశ్రామికవేత్త అశ్విన్‌ కుమార్‌ను వివాహం చేసుకున్న సౌందర్య 2016లో విడాకులు తీసుకున్నారు. వాళ్లకు వేద్‌ అనే కుమారుడు ఉన్నాడు. విశాగన్‌ కూడా తన భార్య నుంచి విడాకులు తీసుకున్నారు.