జగదేక వీరుడు అతిలోక సుందరి, కల్కి తీసినా దత్తుగారి దాహం తీరలేదు.. రాజమౌళితో భారీ మూవీ టార్గెట్
టాలీవుడ్ లో నిర్మాత అశ్విని దత్ కి ప్రత్యేక స్థానం ఉంది. స్వర్గీయ ఎన్టీఆర్ నుంచి ఇప్పటి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరకు చాలా మంది హీరోలతో అశ్విని దత్ సినిమాలు నిర్మించారు.
టాలీవుడ్ లో నిర్మాత అశ్విని దత్ కి ప్రత్యేక స్థానం ఉంది. స్వర్గీయ ఎన్టీఆర్ నుంచి ఇప్పటి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరకు చాలా మంది హీరోలతో అశ్విని దత్ సినిమాలు నిర్మించారు. అశ్విని దత్ కెరీర్ లో ఎన్నో అద్భుతమైన చిత్రాలు నిర్మించారు.
చిరంజీవితో అద్భుత చిత్రాలు
మెగాస్టార్ చిరంజీవితో అశ్విని దత్ నిర్మించిన జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం ఒక సంచనలం. ఆల్ టైం క్లాసిక్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో శ్రీదేవి హీరోయిన్, చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ఇండస్ట్రీ రికార్డులని తిరగరాసింది. ఆ తర్వాత చిరు అశ్విని దత్ కాంబోలో చూడాలని వుంది చిత్రం వచ్చింది. గుణశేఖర్ ఈ చిత్రానికి దర్శకుడు. కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ మూవీ కూడా సూపర్ హిట్. ఆ తర్వాత వచ్చిన ఇంద్ర చిత్రం గురించి ఎంత చెప్పినా తక్కువే. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో బి గోపాల్ తెరకెక్కించిన ఈ చిత్రం తిరుగులేని రికార్డులు సాధించింది.
స్టార్ హీరోలని లాంచ్ చేసిన అశ్విని దత్
మహేష్ బాబు, రాంచరణ్ లాంటి హీరోలని ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత కూడా అశ్విని దత్ గారికే దక్కుతుంది. రాజకుమారుడు చిత్రంతో మహేష్ బాబుని లాంచ్ చేశారు. రాంచరణ్ ని చిరుత చిత్రంతో లాంచ్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్,రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిన స్టూడెంట్ నంబర్ 1 చిత్రానికి ప్రెజెంటర్ గా ఉన్నారు. అంటే రాజమౌళి ఎంట్రీ అశ్విని దత్ ఆధ్వర్యంలోనే జరిగింది.
రాజమౌళితో సినిమా.. దత్తుగారి కల
ఇప్పుడు అశ్విని దత్ తమ కుమార్తెలకు భాద్యతలు అప్పగించి సినిమాలు నిర్మిస్తున్నారు. ఇటీవల వైజయంతి బ్యానర్ నుంచి మహానటి, సీతా రామం, కల్కి లాంటి అద్భుత చిత్రాలు వచ్చాయి. అయినా ఇంకా అశ్విని దత్ దాహం తీరలేదు. రాజమౌళితో పూర్తి స్థాయిలో భారీ బడ్జెట్ చిత్రం నిర్మించాలనేది తన టార్గెట్ అని అశ్విని దత్ రీసెంట్ గా చెప్పారు.
రాజమౌళి స్టూడెంట్ నంబర్ 1 చిత్రంతో దర్శకుడిగా మారారు. ఇప్పుడు ఇండియాలో ఆయన స్థాయి ఏంటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హాలీవుడ్ దర్శకులు స్టీఫెన్ స్పీల్ బర్గ్, జేమ్స్ కామెరూన్ లాంటి దర్శకులు రాజమౌళిని ప్రశంసలతో ముంచెత్తారు. రాజమౌళి తన నెక్స్ట్ మూవీతో పాన్ వరల్డ్ మార్కెట్ పై కన్నేశారు. ఈ తరుణంలో అశ్విని దత్, రాజమౌళి కాంబినేషన్ సెట్ అవుతుందో లేదో అనేది అనుమానమే.
కల్కి చిత్రంతో భారీ విజయం
చివరగా అశ్విని దత్, తన కుమార్తెలు కలసి కల్కి చిత్రాన్ని నిర్మించారు. అశ్విని దత్ అల్లుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకుడు. నాగ్ అశ్విన్ తన క్రియేటివిటీతో మహాభారతం, కల్కి అవతారం నేపథ్యంలో కల్పిత కథని వెండితెరపై ఆవిష్కరించారు. క్లైమాక్స్ లో ప్రభాస్ ని నాగ్ అశ్విన్ కర్ణుడిగా చూపించడం అయితే మైండ్ బ్లోయింగ్ అనే చెప్పొచ్చు. విజువల్స్ కూడా హాలీవుడ్ స్థాయిలో ఉంటూ మెప్పించాయి. సరికొత్త అనుభూతుని ఈ చిత్రం ఇండియన్ ఆడియన్స్ కి అందించింది. కల్కి చిత్రానికి పార్ట్ 2 రాబోతున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ పార్ట్ లో కొన్ని ప్రశ్నలు అలాగే వదిలేశారు. అయితే పార్ట్ 2 ఎప్పుడు వస్తుంది అనేది తెలియదు. ఈ చిత్రంలో దీపికా పదుకొనె కల్కికి జన్మనిచ్చే సుమతి పాత్రలో నటించింది. ఆమెని, కల్కిని రక్షించే పాత్రలో అమితాబ్ కనిపించారు.ప్రపంచం మొత్తం కల్కి చిత్రానికి ప్రశంసలు దక్కాయి.
మరి అశ్విని దత్ కల నెరవేరాలంటే రాజమౌళి, మహేష్ బాబు చిత్రం పూర్తయ్యే వరకు ఆగాల్సిందే. రాజమౌళి మహేష్ చిత్రం రెండేళ్ళకి పూర్తవుతుందో మూడేళ్లు టైం పడుతుందో తెలియదు. పాన్ ఇండియా స్థాయిలో అలరించేలా అటవీ నేపథ్యంలో రాజమౌళి మహేష్ బాబు చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ మహేష్ బాబు ఈ చిత్రం కోసం కొత్త మేకోవర్ లో కనిపిస్తున్నారు.