టాలీవుడ్ అసిస్టెంట్ డైరెక్టర్ అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన హయత్ నగర్ పరిధిలో జరిగింది. శ్రీరామ్ నగర్ కాలానికి చెందిన మరిగంటి కార్తీక్ కుమార్ (31) చిత్ర పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.
టాలీవుడ్ అసిస్టెంట్ డైరెక్టర్ అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన హయత్ నగర్ పరిధిలో జరిగింది. శ్రీరామ్ నగర్ కాలానికి చెందిన మరిగంటి కార్తీక్ కుమార్ (31) చిత్ర పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. ఈ నెల 14న కార్తీక్ కుమార్ ఇంటి నుంచి బయటకి వెళ్లి అదృశ్యమయ్యాడు.
కార్తీక్ తన బైక్ పై బయటకి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కార్తీక్ చివరిగా తన సోదరుడు సందీప్ తో ఫోన్ లో మాట్లాడాడు. ఆ తర్వాత కార్తీక్ కి ఫోన్ చేసిన కలవలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. దీనితో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూ హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
ఆ తర్వాత 116వ తేదీన జీవీఆర్ క్రికెట్ అకాడమీ వద్ద ఓ యువకుడు మృతిచెందినట్లు పోలీసులు సమాచారం అందుకున్నారు. అనుమానంతో కార్తీక్ కుమార్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. 17న కార్తీక్ కుటుంబ సభ్యులు ఆ మృతదేహాన్ని పరిశీలించగా.. అది తమ కార్తీక్ దే అని గుర్తించారు. దీనితో కార్తీక్ కుటుంబంలో విషాదం నెలకొంది.
దీనితో పోలీసులు కార్తీక్ మరణాన్ని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. కార్తీక్ ఆత్మహత్య చేసుకున్నాడా లేక హత్యా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
టాలీవుడ్ లో ఇలాంటి విషాదకర సంఘటనలు తరచుగా జరుగుతున్నాయి. పోలీసులు కార్తీక్ కుమార్ ఫ్యామిలిలో సమస్యలు ఏమైనా ఉన్నాయా.. గత కొన్ని రోజులుగా అతడు ఏం చేస్తూ ఉండేవాడు అనే అంశాలపై కూడా ఆరా తీస్తున్నారు.
