Asianet News TeluguAsianet News Telugu

క్యాన్సర్‌ తో పోరాడుతూ యంగ్ స్టార్ మృతి.. షాక్ లో చిత్ర పరిశ్రమ

ఫిల్మ్ ఇండస్ట్రీని వరుస విషాదాలు పట్టి పీడిస్తున్నాయి.  ఒక్కొక్కుగా సినీతారలు.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతున్నారు. ఇక తాజాగా     అతి చిన్న వయస్సులో అస్సామీ  నటుడు అనారోగ్యంతో మరణించాడు. 
 

Assamese Actor kishor das dies from cancer at 30
Author
Hyderabad, First Published Jul 3, 2022, 7:02 PM IST

ఇండియాన్ ఫిల్మ్ ఇండస్ట్రీ  అద్భుతమైన నటీనటులు కోల్పోతోంది.  చిత్ర పరిశ్రమలో వరుసగా విషాదాలు ఉక్కిరిబిక్కి చేస్తున్నారు. సౌత్ నార్త్ ఆర్టిస్ట్ లు ఎవరో ఒకరు వరుసగా కన్ను మూస్తున్నారు. రీసెంట్ గా హీరోయిన్ మీనా భర్త మరణించగా.. తాజాగా మరో యంగ్ స్టార్ కన్ను మూశాడు. అతి చిన్న వయస్సులో అస్సామీ యువ నటుడు ప్రాణాలను కోల్పోయాడు. అస్సామీ నటుడు కిశోర్‌ దాస్‌ 30 ఏళ్ల చిన్న వయస్సులో  క్యాన్సర్‌ మహమ్మారితో  పోరాడుతూ కన్నుమూశాడు. ఈ విషాద ఘటనతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక్క సారిగా షాక్ తిన్నది. 

చాలా హ్యాండ్సమ్ గా ఉండే కిషోర్ దాస్ మంచి నటుడు కూడా..అటువంటిది అంత చిన్న వయస్సులో  కిషోర్ దాస్ మరణం ఇండస్ట్రీ జీర్ణించుకోలేకపోతోంది.  ఈ అస్సామీ యంగ్ స్టార్  క్యాన్సర్‌తో చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశాడు. దీంతో సినీ పరిశ్రమలో విషాదం అలుముకున్నది. లాస్ట్ ఇయర్ కిషోర్ దాస్ కు క్యాన్సర్‌ అని తెలిసింది. అయితే ఈ  ఏడాది మార్చి నుంచి అతను  క్యాన్సర్‌కు  ట్రీట్మెంట్  తీసుకుంటున్నాడు. సడెన్ గా  పరిస్థితి విషమించడంతో కిషోర్  ప్రాణాలను కోల్పోయాడు. 

అయితే కిషోర్ మరణానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటున్న సమయంలోనే అతను కొవిడ్‌-19 సమస్యలతో బాధపడ్డాడు. ఒక రకంగా కోవిడ్ సమస్య కూడా కిషోర్ ను చాలా ఇబ్బందులు పెట్టింది.  కొన్ని వారాల కిందట ఆసుపత్రిలోట్రీట్ మెంట్ తీసుకుంటున్న ఫోటోను తన అభిమానుల కోసం సోషల్ మీడియాలో పంచుకున్నాడు యంగ్ స్టార్. ఈ ఫోటో చూసిన అభిమానులు తమ స్టార్ త్వరగా కోలుకుని వస్తాడు లే అని అనుకున్నారు.  ఈ పోస్ట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాల వైరల్‌గా మారింది. 

 

కిశోర్‌ దాస్‌  మ్యూజిక్‌ వీడియోలతో బాగా ఫేమస్ అయ్యాడు 30 ఏళ్ల వయసులోనే చాలా కష్టపడి తనకంటూ ఓ ఇమేజ్ సాధించుకున్నాడు. అసోంలోని కమ్రూప్‌ లో పుట్టిన కిశోర్ దాస్.. అంచలెంచలుగా  ఎదుగుతూ వచ్చారు. కిశోర్‌ దాస్‌.. బిధాత, బంధున్, నెదేఖా ఫగన్ తదితర అస్సామీ టెలివిజన్‌ షోలతో మంచి గుర్తింపును పొందాడు. అలాగే కిశోర్ దాస్ అస్సామీలో 300కి పైగా మ్యూజిక్ వీడియోల్లో నటించాడు. తురుట్‌ తురుట్‌ పాట.. అస్సామీ ఓవర్‌ నైట్‌ స్టార్‌గా ఎదిగాడు. ఇక  కరోనా ప్రొటోకాల్స్‌  ప్రకారం అంత్యక్రియలను శనివారం సాయంత్రం చెన్నైలో నిర్వహించారు. అస్సామీ ఇండ్రస్టీలో ఎక్కువగా పని చేసిన దాస్ చివరిసారిగా దాదా తుమీ డస్తో బోర్ అనే అస్సామీ సినిమాలో నటించి మెప్పించాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios