ఎలాంటి సంభాషణలు లేకుండా మూకీ మూవీ కావడంతో ఈ సైలెంట్ ఎరోటిక్ డ్రామా పై ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది. గతంలో కమల్ హాసన్ హీరోగా సింగీతం శ్రీనివాస్ తెరకెక్కించిన పుష్పక విమానం మూవీ తరహాలోనే ‘హోలీ ఊండ్ ’ మూవీలో పాత్రలు మాట్లాడవు. కేవలం బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తోనే మూవీ కొనసాగనుంది.
గే, లెస్బియన్, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్ ల చుట్టూ తిరిగే కథాంశాలకు ఇన్నాళ్లూ హాలీవుడ్ ఆశ్రయమిస్తూ వచ్చింది. ఇప్పుడు మెల్లి మెల్లిగా మనకు కూడా ఆ సినిమాలు పెరుగుతున్నాయి. ఈ సినిమాలను భాషా భేధం లేకుండా ఓ వర్గం ఆదరిస్తుందనే నమ్మకం సిని పరిశ్రమలో ఉంది. అయితే ఇలాంటి కథను సైలెంట్ సినిమాగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మళయాళ దర్శకుడు అశోక్.ఆర్ నాథ్.
#HolyWound హోలీ ఊండ్ టైటిల్ తో రూపొందిన ఈ సినిమా ఎరోటిక్ సైలెంట్ మూవీ. ఈ సినిమాని ఓటిటి ప్లాట్ ఫామ్ ల పైకి ఆగస్ట్ 12న రిలీజ్ చేస్తున్నారు. ఈ మేరకు ఓటిటి సంస్దలతో చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఓటిటి ప్లాట్ ఫామ్ ఫైనల్ అయ్యాక ఈ సినిమా విషయమై అఫీషియల్ ప్రకటన రాబోతోంది.
ఎలాంటి సంభాషణలు లేకుండా మూకీ మూవీ కావడంతో ఈ సైలెంట్ ఎరోటిక్ డ్రామా పై ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది. గతంలో కమల్ హాసన్ హీరోగా సింగీతం శ్రీనివాస్ తెరకెక్కించిన పుష్పక విమానం మూవీ తరహాలోనే ‘హోలీ ఊండ్ ’ మూవీలో పాత్రలు మాట్లాడవు. కేవలం బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తోనే మూవీ కొనసాగనుంది. డైలాగ్స్ లేని సైలెంట్ సినిమాను కేవలం ఆ నటీనటుల హావభావాలతో ఎంజాయ్ చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఓటిటి దగ్గర కచ్చితంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని దర్శక,నిర్మాతలు నమ్ముతున్నారు.
